GST Council: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు ఇవే.. | GST Rates Changed For Some Products And Services Check The Details Here | Sakshi
Sakshi News home page

GST Council: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు ఇవే..

Published Sat, Jun 22 2024 9:00 PM | Last Updated on Sat, Jun 22 2024 9:16 PM

GST Rates Changed For Some Products And Services Check The Details Here

సాక్షి, ఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో వారి అభిప్రాయాలను తీసుకోవడానికి బడ్జెట్‌కు ముందు సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాత నేడు జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) కౌన్సిల్ 53వ సమావేశం జరిగింది. ఇందులో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.

చదువుకునే వారు కాలేజీలో కాకుండా.. బయట హాస్టల్ వసతి పొందుతున్నప్పుడు నెలకు 20వేల రూపాయలు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని పాలకమండలి సిఫార్సు చేసింది. అయితే విద్యార్ధి తప్పనిసరిగా 90 రోజులు హాస్టల్‌లో ఉండాలి. ఈ ప్రయోజాన్ని హోటళ్లు ఉపయోగించకుండా ఉండటానికి ప్రవేశపెట్టారు.

ప్రయాణికులకు రైల్వే అందించే పలు సర్వీసుల్లో కూడా జీఎస్టీ మినహాయిపు ఉంటుంది. ఇందులో రైల్వే ఫ్లాట్‌ఫామ్‌ టికెట్స్, ప్రయాణికులు ఉండటానికి కేటాయించిన గదులు, లగేజీ సర్వీసులకు, బ్యాటరీతో నడిచే వాహనాలు, ఇంట్రా-రైల్వే వంటి సేవలపై కూడా జీఎస్టీ మినహాయింపు ఉంటుంది.

అన్ని రకాల పాల క్యాన్లపైన, కార్టన్ బాక్సులపైన జీఎస్టీ 12 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. కార్టన్ బాక్సులపై జీఎస్టీ తగ్గింపు యాపిల్, ఇతర పండ్ల వ్యాపారాలకు మేలు చేస్తుంది. వీటితో పాటు అంతే కాకుండా అన్నిరకాల స్ప్రింకర్లను 12 శాతం జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు. అన్నిరకాల సోలార్ కుక్కర్ల మీద 12 శాతం జీఎస్టీ విధించారు.

నిర్దిష్ట సంస్కరణలు చేపట్టేందుకు రాష్ట్రాలకు కేంద్రం 50 ఏళ్ల వడ్డీ లేని రుణం ఇచ్చే పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్మల సీతారామన్ రాష్ట్రాలను కోరారు. ఈ మొత్తాన్ని విద్య, వైద్య, నీటి పారుదల, మంచి నీటి సరఫరా వంటి వాటికి ఉపయోగిపొంచుకోవచ్చు. రాష్ట్రాల మూల ధన వ్యయాలను పెంచాలనే ఉద్దేశ్యంతో 2020-21లో ఈ పథకాన్ని మొదటిసారి ప్రవేశపెట్టారు.

ఇంధనాన్ని (పెట్రోల్ & డీజిల్) జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడం గురించి అడిగినప్పుడు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తీసుకొచ్చిన జీఎస్‌టీ ఉద్దేశం పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీలో చేర్చడమే. రాష్ట్రాలే దీనిపైనా ఒక నిర్ణయానికి వస్తే.. జిఎస్‌టిలో పెట్రోల్ మరియు డీజిల్‌ను చేర్చాలని మేము కోరుకుంటున్నామని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement