ఆరోగ్యబీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు అంశానికి సంబంధించి త్వరలో కీలక ప్రకటన వెలువడనుంది. ఈ నెల 9వ తేదీన జరగబోయే జీఎస్టీ కౌన్సిల్‌లో ఈమేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ అనుకున్న విధంగానే ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయిస్తే రూ.650 కోట్ల నుంచి రూ.3,500 కోట్లు వరకు కేంద్ర ఖజానాపై భారం పడనుంది.
దేశంలో చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల ఖర్చు ఏటా పెరుగుతోంది. కొన్ని సర్వేల ప్రకారం వైద్య ఖర్చులు ఏటా 30-40 శాతం మేర అధికమవుతున్నాయి. దాంతో చాలామంది ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు. అయితే ప్రతివ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు ఈ సదుపాయాన్ని ఉపయోగిస్తున్నాడు. కాబట్టి పాలసీదారులకు అండగా నిలిచేలా ప్రభుత్వం తాము చెల్లిస్తున్న బీమా ప్రీమియంపై జీఎస్టీని మినహాయించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.
ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత బలమైన బ్రాండ్
గతంలో జరిగిన పార్లమెంట్ సమావేశంలోనూ ప్రతిపక్ష నేతలు, నితిన్ గడ్కరీ వంటి పాలకపక్ష నేతలు ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీను తొలగించాలని ఆర్థికశాఖకు సిఫార్సు చేశారు. దాంతో త్వరలో జరగబోయే సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంటారనే ఊహాగానాలు వస్తున్నాయి. ప్రీమియంపై జీఎస్టీ మినహాయిస్తే బీమా కంపెనీలు మరింత ఎక్కువగా పాలసీలు జారీ చేసే అవకాశం ఉంది. దాంతో ఆయా కంపెనీల రెవెన్యూ పెరుగుతుందని మార్కెట్ భావిస్తోంది. ప్రస్తుతం ఆరోగ్య బీమా ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఇదిలాఉండగా, జీఎస్టీని పూర్తిగా మినహాయించకుండా కొన్ని షరతులతో పన్ను తగ్గించే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment