జీఎస్‌టీ మండలి భేటీలో ఏకాభిప్రాయం
తదుపరి సమావేశంలో దీనిపై నిర్ణయం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: ఆరోగ్య, జీవిత బీమా పాలసీల ప్రీమియంపై జీఎస్‌టీ తగ్గించాలన్న డిమాండ్ పట్ల జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో విస్తృత ఏకాభిప్రాయం వచి్చంది. దీనిపై వచ్చే నెల చివర్లోగా నివేదిక సమర్పించాలని బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి అధ్యక్షతన గల మంత్రుల బృందాన్ని (జీవోఎం) కోరినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ తెలిపారు. ఈ నివేదిక అందిన తర్వాత దీనిపై జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు.
ప్రస్తుతం టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల ప్రీమియంపై 18 శాతం జీఎస్‌టీ అమలవుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 54వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం సోమవారం జరిగింది. ఇందులో బీమా పాలసీలపై ప్రీమియం తగ్గింపు ప్రధానంగా చర్చకు వచి్చంది. నెలవారీ జీఎస్‌టీ వసూళ్లు పెరుగుతుండడంతో పన్ను రేటు తగ్గింపు పట్ల చాలా రాష్ట్రాలు సానుకూలంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
జీఎస్‌టీ తగ్గిస్తే ఆ మేరకు ప్రీమియం రేట్లు దిగొస్తాయి. ఇది కోట్లాది మంది పాలసీదారులకు ఉపశమనాన్ని కలి్పంచనుంది. జీఎస్‌టీకి ముందు బీమా పాలసీల ప్రీమియంపై 12% సరీ్వస్ ట్యాక్స్ వసూలు చేసేవారు. కేన్సర్ ఔషధాలపై జీఎస్‌టీ తగ్గింపు: కొన్ని రకాల కేన్సర్ ఔషధాలపై జీఎస్‌టీని 12 శాతం నుంచి 5 శాతానికి.. కేదార్‌నాథ్ తదితర పర్యటనల కోసం వినియోగించుకునే హెలికాప్టర్ సేవలపై జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించింది.
చార్టర్ హెలీకాప్టర్లపై ఎప్పటి మాదిరే 18 శాతం జీఎస్‌టీ అమలు కానుంది. ఆన్‌లైన్ గేమింగ్‌పై 2023 అక్టోబర్ 1 నుంచి 28 శాతం జీఎస్‌టీని అమలు చేయడం వల్ల ఆదాయం 412 శాతం పెరిగి రూ.6,909 కోట్లకు చేరుకున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. విదేశీ ఎయిర్‌లైన్స్ సంస్థలు దిగుమతి చేసుకునే సేవలపై జీఎస్‌టీని మినహాయించాలని కౌన్సిల్ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment