అగర్‌బత్తీలపై బాదుడు తగ్గింపు | GST Council reduced tax rates of 66 items: FM Arun jaitley | Sakshi
Sakshi News home page

అగర్‌బత్తీలపై బాదుడు తగ్గింపు

Published Sun, Jun 11 2017 4:14 PM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM

అగర్‌బత్తీలపై బాదుడు తగ్గింపు - Sakshi

అగర్‌బత్తీలపై బాదుడు తగ్గింపు

- స్కూల్‌ బ్యాగులు, ఇన్సులిన్‌పైనా కనికరం
- ప్రింటర్లు సహా మొత్తం 66 వస్తువులపై పన్నుల శాతం కుదింపు
- జీఎస్టీ మండలి నిర్ణయాలు వెల్లడించిన జైట్లీ


న్యూఢిల్లీ:
దేశవాసులకు కాస్త ఉపశమనం. జులై 1 నుంచి అమలులోకి రానున్న వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోని 66 రకాల వస్తువులపై భారీగా విధించిన పన్నుల శాతం కొంత మేర తగ్గింది. జీఎస్టీ మండలి ఆదివారం నాటి సమావేశంలో ఈ మేరకు తీసుకున్న నిర్ణయాలను ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మీడియాకు వెల్లడించారు. వ్యాపారులు, పౌరసమాజం నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిశీలించిన అనంతరం 66 రకాల వస్తువులపై పన్ను శాతాన్ని తగ్గించేందుకు జీఎస్టీ మండలి నిర్ణయించిందని ఆయన చెప్పారు.

ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో ఆదివారం జీఎస్టీ మండలి 16వ సమావేశం నిర్వహించారు. వాస్తవానికి 133 రకాల వస్తువులపై పన్నుల శాతాన్ని తగ్గించాలని ప్రతిపాదనల కమిటీ సిఫార్సు చేసినప్పటికీ, వాటిలో 66 వస్తువలకు మాత్రమే జీఎస్టీ మండలి అంగీకరించడం గమనార్హం. దీనితోపాటు ఉత్పత్తిదారులు, వ్యాపారులు, రెస్టారెంట్ల యజమానుల అందించే నష్ణపరిహార పథకం పరిధిని కూడా పెంచారు. ఇంతకముందు రూ.50 లక్ష టర్నోవర్‌ ఉన్నసంస్థలకు మాత్రమే నష్టపరిహారం అందిస్తామన్న మండలి.. ఆ పరిధిని రూ.75 లక్షలకు పెంచింది.

తాజా ప్రతిపాదనలతో ఆయా వస్తువులపై పన్ను శాతం ఇలా ఉంది..

  • అగర్‌బత్తీలు - 12శాతం నుంచి 5శాతానికి కుదింపు
  • బాదాంపప్పు - 12 నుంచి 5శాతానిక తగ్గింపు
  • ప్యాకింగ్‌ చేసిన ఆహార పదార్థాల(పండ్లు, కూరగాయలు, పచ్చళ్లు) - 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు
  • కంప్యూటర్‌ ప్రింటర్లు -  28 శాంతం నుంచి 18కి కుదింపు
  • స్కూల్‌ బ్యాగులు - 28 శాంతం నుంచి 18 శాతానికి తగ్గింపు
  • డెంటల్‌ వాక్స్‌ - 28 నుంచి 18
  • ఇన్సులిన్‌ - 12 నుంచి 5
  • ప్లాస్టిక్‌ బెడ్స్‌ 28 నుంచి 18
  • ప్లాస్టిక్‌ టర్పాలిన్‌ 28 నుంచి 18
  • ఎక్సర్‌సైజ్‌ పుస్తకాలు 18 నుంచి 12
  • కలరింగ్‌ బుక్స్‌పై 12 శాతంగా ఉన్న పన్నును పూర్తిగా ఎత్తేశారు
  • ప్రీకాస్ట్‌ కాంక్రీట్‌ పైపులు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింపు
  • ట్రాక్టర్‌ విడిభాగాలు 28 శాతం నుంచి 18 శాతానికి కుదింపు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement