న్యూఢిల్లీ: జీఎస్‌టీ అమలులో కేంద్రం దాదాపు ఆఖరి అంకానికి చేరుకుంది. ఈ చట్టంలోని మరో కీలకమైన ఎస్‌జీఎస్‌టీ, యూటీజీఎస్‌టీలకు జీఎస్‌టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. గురువారం సమావేశమైన కౌన్సిల్ 12వ సమావేశంలో ఈ మేరకు ఈ చట్టాలను ఆమోదించింది. జూ సెంట్రల్ జీఎస్టీ (ఎస్‌జీఎస్టీ) గరిష్ట పన్ను 20శాతంగా ఇంటిగ్రేటెడ్ జిఎస్టి (సీజీఎస్టీ) గరిష్ట పన్ను 40శాతంగా, సగటు 28శాతంగా కౌన్సిల్ నిర్ణయించింది.
ఈ అయిదు చట్టాల ఆమోదం తర్వాత జూలై 1న జీఎస్‌టీ బిల్లును పార‍్లమెంటులో ఆమోదింప చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. వీటిని కేంద్ర క్యాబినెట్ ఆమోదం అనంతరం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నామని ఆయన మీడియాకు తెలిపారు. అలాగే ఎస్‌జీఎస్‌టీ ని ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉందని ఆయన చెప్పారు. లగ్జరీ వస్తువులపై పన్నును 15 శాతంగా నిర్ణయించినట్టు చెప్పారు. బొగ్గుపై టన్నుకు రూ.400గా , పాన్ మసాలా రూ. 135శాతం, సిగరెట్లపై 290 శాతం పన్ను నిర్ణయించగా, బీడీలపై పన్నును ఇంకా నిర్ణయించాల్సి ఉందని తెలిపారు.
మరో నాలుగు అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ మొదటివారంలో జరిగే కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నట్టు జైట్లీ వివరించారు. పన్ను స్లాబ్‌లపై మార్చి 31 సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. బార్లు, రెస్టారెంట్లు, పాన్ మసాలాలు, లగ్జరీ కార్లు ప్యాకేజ్డ్ ఫుడ్ లాంటి డీమెరిట్ గూడ్స్ ప్రియం కానుండగా, ఫ్రిజ్‌లు, సబ్బులు, తల నూనెలు , టూత్ పేస్ట్ ల ధరలు చవక కానున్నాయి. అయితే అత్యవసర ధరలు యథాతథంగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఎనలిస్టుల అంచనా.
మరోవైపు సినిమాలపై విధించే ఎంటర్‌టైన్ మెంట్ టొబాకో, బీడీ ఉత్పత్తులపై విధించే పన్నులపై చర్చలు జరిగాయనీ, సెజ్ టాక్సేషన్ పై కౌన్సిల్ సమావేశంలో చర్చలు జరిగినట్టు మనీష్ సిసోడియా మీడియాకు తెలిపారు.
కాగా సీజీ, ఐజీ, కాంపన్‌సేషన్ జీఎస్‌టీ చట్టాలను కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అయితే ఫిట్‌మెంట్ రేట్లను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.
ఎస్జీఎస్టీ, యూటీజీఎస్‌టీ లకు ఆమోదం
Published Thu, Mar 16 2017 7:31 PM | Last Updated on Tue, Sep 5 2017 6:16 AM
Advertisement
Advertisement