కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో అసోంలో జరిగిన జీఎస్‌టీ 23వ కౌన్సిల్ సమావేశంలో జీఎస్‌టీ రేట్ల స్లాబ్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. గౌహతిలో శుక్రవారం జరిగిన మండలి సమావేశంలో నిత్యావసరమైన పలు వస్తువులపై జీఎస్‌టీని తగ్గించింది. ఇప్పటి వరకు 227 వస్తువులపై 28శాతం పన్ను రేటు వుండగా ప్రస్తుతం కేవలం 50 వస్తువులపై మాత్రమే 28శాతం పన్ను నిర్ణయించినట్టు బిహార్ ఆర్థికమంత్రి సుశీల్ మోడీ ప్రకటించారు. పొగాకు, లగ్జరీ వస్తువలపై మాత్రమే అధిక రేట్లను నిర్ణయించామని చెప్పారు.