పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలకు ప్రవేశ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని లెవీ పరిధి నుంచి మినహాయిస్తూ జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేసిందని పేర్కొన్నారు. అలాగే పెన్సిళ్లు, షార్పనర్‌లపైనా లెవీని తగ్గించాలని జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది.
విద్యార్థులు దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం వివిధ పరీక్షలకు సిద్ధమవుతుంటారు. వీటికి చెల్లించే ఫీజుపై ఇప్పటివరకు 18 శాతం జీఎస్టీని చెల్లించాల్సి వచ్చేది. తాజాగా ప్రవేశ పరీక్ష ఫీజులపై జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించడం విద్యార్థులకు ఊరట కలిగించే అంశం. ఈ మేరకు ఫీజులు తగ్గే అవకాశం ఉంది.
అలాగే విద్యార్థులకు ఊరట కలిగించే మరో అంశం పెన్సిల్, షార్పనర్‌లపై విధించే జీఎస్టీని తగ్గించడం. వీటిపై ప్రస్తుతం జీఎస్టీ 18 శాతంగా ఉంది. దీన్ని 12 శాతానికి తగ్గించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
(ఇదీ చదవండి: కేంద్రం తీపికబురు: రూ. 16,982 కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లింపు)
Comments
Please login to add a commentAdd a comment