: గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్‌టీ) అమలుకు సంబంధించిన మరో ప్రధానమైన,కీలకమైన అడుగు పడింది
న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్‌టీ) అమలుకు సంబంధించిన మరో ప్రధానమైన,కీలకమైన అడుగు పడింది. జీఎస్‌టీ అమలు అతి కీలకంగా భావించే భారత రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం జీఎస్‌టీకి సంబంధించిన నలుగురు సహాయక చట్టాలకు ఆమోదం తెలిపారు. ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందిన నాలుగు జీఎస్టీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదంతో ఈ ఏడాది జులై 1 నుంచి దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రయత్నానికి మార్గం మరింత సుగమమం కానుంది.
సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ బిల్ ( సీజీఎస్‌టీ), ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ బిల్ (ఐజీఎస్‌టీ) గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (రాష్ట్రాలకు పరిహారం) బిల్లు, కేంద్ర పాలిత గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (యూటీజీఎస్‌టీ) బిల్లుకు ప్రణబ్ ఆమోదం తెలిపారు. జీఎస్‌టీ రేట్లపై మే 18-19 తేదీల్లో జిఎస్టి కౌన్సిల్ లో చర్చించనున్నారు.
కాగా ఏప్రిల్ 6న పార్లమెంటు ఈ నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపింది. కేంద్రం ప్రభుత్వం జూలై 1వతేదీనుంచి జీఎస్‌టీ అమలులోకి తేవాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.