Zomato Delivery Boy Clears Tamil Nadu Public Service Commission - Sakshi
Sakshi News home page

Zomato Delivery Boy: జొమాటో బాయ్‌గా పనిచేస్తూనే.. చిరకాల స్వప్నాన్ని సాధించాడు..

Published Mon, Jul 24 2023 6:29 PM | Last Updated on Mon, Jul 24 2023 6:59 PM

Zomato Delivery Boy Clears Tamil Nadu Public Service Commission - Sakshi

చెన్నై: ఆశయాలు స్వప్నాలతో సాకారం కావు. నిబద్ధతతో పనిచేస్తే ఏ లక్ష‍్యాన్నైనా సాధించవచ్చు. ఇది నిజమని నిరూపించిన వారి నిజజీవిత కథలెన్నోమనం చూశాం. అలాంటి కోవలోకే చేరారు తమిళనాడుకు చెందిన విగ్నేష్. ఓ వైపు జొమోటో బాయ్‌గా పనిచేస్తూనే రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీసు పరీక్షలో ఉత్తీర‍్ణత సాధించి ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకున్నాాడు. 

విగ్నేష్ తమిళనాడుకు చెందిన యువకుడు. డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఖర్చుల కోసం ఓ వైపు జొమోటోలో ఉద్యోగం చేస్తూనే మిగిలిన సమయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవాడు. చివరికి తన చిరకాల స్వప్నాన్ని సాధించాడు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. ప్రభుత్వ కొలువును చేజిక్కించుకున్నాడు.

ఈ విషయాన్నే జొమోటో తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఓ వైపు తమ సంస్థలో పనిచేస్తూనే రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో రాణించిన తమ ఉద్యోగి అంటూ విగ్నేష్ కుటుంబంతో సహా ఉన్న ఫొటోను పంచుకుంది. ఈ పోస్టు నెట్టింట వేగంగా వైరల్‌గా మారింది. 1337 లైకులు, 59 రీట్వీట్‌లు వచ్చాయి. నెటిజన్లు విగ్నేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. 

ఇదీ చదవండి: వరదలతో రారాజు అగచాట్లు.. అడవిని విడిచి రోడ్డుపై.. వీడియో వైరల్..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement