న్యూఢిల్లీ: బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థల కోసం ప్రత్యేకంగా దివాలా చట్టాన్ని రూపొందించే ఆలోచనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, భీమా సంస్థలు, ఆర్ధిక రంగ సంస్థల్లో దివాలా పరిస్థితిని ఎదుర్కొనేందుకు సమగ్ర పరిష్కార కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన డిపాజిట్ బీమా బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
.ఈ ప్రత్యేక దివాలా చట్టంలోని ప్రతిపాదిత కార్పొరేషన్ బ్యాంకుల వ్యవస్థల్లోని స్థిరత్వాన్ని, పునరుద్ధరణను కాపాడుతుందని కేంద్రం పేర్కొంది. సాధ్యమైనంత వరకు సహేతుకమైన పరిమితి వరకు కవర్ బాధ్యతల వినియోగదారులను రక్షించడం, ప్రజా నిధులను రక్షించడమే లక్ష్యమని తెలిపింది.
తద్వారా రిజల్యూషన్ కార్పొరేషన్ ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గారంటీ కార్పొరేషన్ చట్టం, 1961 బాధ్యతలు ఈ కార్పొరేషన్‌కు బదిలీ కానున్నాయని తెలిపింది. అలాగే వ్యవసాయ అభివృద్ధి కోసం పాలస్తీనాతో ఒక ఒప్పందాన్ని ఆమోదించాలని క్యాబినెట్ నిర్ణయించింది. దీంతో ప్రధానంగా మొండిబకాయిల సమస్క పరిష్కారానికి రూపొందించిన దివాలా చట్టం(ఐబీసీ), చిన్న బ్యాంకుల విలీనం ద్వారా బ్యాంకింగ్ రంగంలో కన్సాలిడేషన్‌కు తెరలేవనుందని ఎనలిస్టులు భావిస్తున్నారు.
దివాలా చట్టానికి కేబినెట్ ఆమోదం
Published Wed, Jun 14 2017 5:24 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM
Advertisement