సాక్షి, భీమవరం : క్షత్రియులు సమాజం కోసం, ధర్మం కోసం పోరాడుతారని, భీమవరం అభివృద్దిలో వారి పాత్ర కీలకం అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ క్షత్రియులను ఉద్దేశించి మాట్లాడారు. భీమవరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తన వల్ల భీమవరం ప్రజానీకానికి ట్రాఫిక్ ఇబ్బంధి వచ్చి ఉంటే మన్నించాలంటూ ప్రజలను కోరారు. అన్ని కులాల్లో పేదరికం ఉందని, పేరుకే అగ్రకులాలు.. వాటిలో కూడా పేదరికం చాలా ఉందని అన్నారు.
అశోక్ గజపతిరాజుపై చేసిన విమర్శలు వ్యక్తిగతం కావని, విధివిధినాలపై చేసినవేనని, కుల పరంగా చేసినవి కాదంటూ స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడిని అంటే కమ్మవారినందరిని అన్నట్లు కాదని తెలిపారు. అంబేడ్కర్, అల్లూరి లాంటి మహనీయులను ఒక కులానికి ప్రతినిధులుగా చూడలేమని చెప్పారు. తనని తాను తగ్గించుకునే వాడు హెచ్చించబడతాడని బైబిల్‌లో ఉందని పేర్కొన్నారు. భీమవరం ఒక హైదరాబాద్ అయ్యే అవకాశం ఉందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment