దేశంలో తొలి హెలిపోర్టు | India's first heliport inaugurated in Rohini | Sakshi
Sakshi News home page

దేశంలో తొలి హెలిపోర్టు

Published Wed, Mar 1 2017 1:23 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

India's first heliport inaugurated in Rohini

న్యూఢిల్లీ: దక్షిణాసియాలోనే తొలిసారిగా రూ.100 కోట్లతో ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో నెలకొల్పిన ఇంటిగ్రేటెడ్‌ హెలిపోర్టు(హెలికాప్టర్లు నిలిపే స్థలం)ను మంగళవారం పౌర విమాన మంత్రి అశోక్‌ గజపతిరాజు ప్రారంభించారు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. 25 ఎకరాల్లో 16 హెలికాప్టర్ల సామర్థ్యంతో 150 మంది ప్రయాణికులకు సరిపోయేలా హెలిపోర్టును పవన్  హన్స్  లిమిటెడ్‌ నిర్మించింది.  ఇతర దేశాలతో పోలిస్తే గగన తల ప్రయాణం ఎంచుకుంటున్న భారతీయుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందన్నారు. ఈ ప్రయాణికుల సంఖ్య ఒక్క జనవరిలోనే దాదాపు 25 శాతానికిపైగా పెరిగిందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement