సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ క్రమంగా అధికార టీడీపీతో దూరం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా పవన్ కల్యాణ్ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు. 'అశోక్ గజపతి రాజుగారికి పవన్ కల్యాణ్ ఎవరో తెలియదు. మంత్రి పితానిగారికి పవన్ కల్యాణ్ ఎవరో తెలియదు. సంతోషం' అని పవన్ ట్వీట్ చేశారు.
తాజాగా పవన్ కల్యాణ్‌తో టీడీపీ మైత్రీ కొనసాగుతుందా? అని మంత్రి పితాని సత్యనారాయణను విలేకరులు ప్రశ్నించగా.. పవన్ కల్యాణ్‌కు ఏపీలో పార్టీ జెండానే లేదు.. పవన్ గురించి ఆలోచించే ఓపిక,టైమ్ రెండూ లేవని ఆయన వ్యాఖ్యానించారు. అశోక్ గజపతిరాజు కూడా గతంలో ఇదేవిధంగా స్పందించారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఈ ట్వీట్ చేసినట్టు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీ-బీజేపీ కూటమికి అనుకూలంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన అధికార టీడీపీకి దూరం జరుగుతున్నట్టు కనిపిస్తోంది.
Ashok Gajapathi Raju Gariki Pawan kalyan evaro telliyudu Manthri Pithani gariki Pawan Kalyan ento telyudu.. SANTHOSHAM...
— Pawan Kalyan (@PawanKalyan) 6 October 2017
Comments
Please login to add a commentAdd a comment