దేశంలో తొలి హెలిపోర్టు
న్యూఢిల్లీ: దక్షిణాసియాలోనే తొలిసారిగా రూ.100 కోట్లతో ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో నెలకొల్పిన ఇంటిగ్రేటెడ్ హెలిపోర్టు(హెలికాప్టర్లు నిలిపే స్థలం)ను మంగళవారం పౌర విమాన మంత్రి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. 25 ఎకరాల్లో 16 హెలికాప్టర్ల సామర్థ్యంతో 150 మంది ప్రయాణికులకు సరిపోయేలా హెలిపోర్టును పవన్ హన్స్ లిమిటెడ్ నిర్మించింది. ఇతర దేశాలతో పోలిస్తే గగన తల ప్రయాణం ఎంచుకుంటున్న భారతీయుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందన్నారు. ఈ ప్రయాణికుల సంఖ్య ఒక్క జనవరిలోనే దాదాపు 25 శాతానికిపైగా పెరిగిందని చెప్పారు.