
నన్ను పీఏగా రమ్మంటావా..!
‘నన్ను పీఏగా రమ్మంటావా..’ అంటూ జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) ఎస్‌ఈపై కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ.. రైల్వే శాఖ పట్టణంలో నిర్మిస్తున్న వంతెనకు అప్రోచ్ రోడ్డు ఏర్పాటు విషయంలో జాప్యం ఎందుకు జరుగుతోందని అధికారులను నిలదీశారు. దీంతో ఎన్‌హెచ్‌ఏఐ ఎస్‌ఈ మనోహర్‌రెడ్డి లేచి.. తమకసలు ప్రతిపాదనలే అందలేదని బదులిచ్చారు. రైల్వే అధికారులు కల్పించుకుని ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. రైల్వే శాఖ ప్రతిపాదనలు పంపించామంటుంటే.. మీరు రాలేదంటున్నారేంటని అశోక్ గజపతిరాజు ఎస్‌ఈని నిలదీశారు. ఇంతవరకూ అవి తమకు అందలేదని ఎస్‌ఈ మళ్లీ స్పష్టం చేశారు. లోపం ఎక్కడుందో తెలుసుకోవాలి కదా అని అశోక్ అనడంతో.. అది మీరే తెలుసుకోవాలని ఎస్‌ఈ బదులిచ్చారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన కేంద్ర మంత్రి.. ‘మీ పనులు చూసేందుకు నన్ను మీ పీఏగా రమ్మంటారా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.