కేంద్ర మంత్రి కనిపించటం లేదంటూ ఫిర్యాదు | missing case booked on Union minister | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి కనిపించటం లేదంటూ ఫిర్యాదు

Published Tue, Sep 13 2016 7:54 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

కేంద్ర మంత్రి కనిపించటం లేదంటూ ఫిర్యాదు - Sakshi

కేంద్ర మంత్రి కనిపించటం లేదంటూ ఫిర్యాదు

కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు కన్పించడం లేదని మంగళవారం ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో సీపీఐ జనరల్ సెక్రటరీ చిన్నం పెంచులయ్య ఫిర్యదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులుగా, ఎంతో రాజకీయ అనుభవం ఉండి కూడా ప్రత్యేక హోదాపై ఎక్కడా కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు స్పందించ లేదన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎవ్వరికీ కనపడడం లేదని, ఆయన ఏమయ్యారని రాష్ట్ర ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారన్నారు. విజయనగరం పార్లమెంట్ సభ్యుడు అశోక్‌గజపతి రాజు ప్రత్యేకహోదా కోసం మాట్లాడాలని, రాష్ట్ర అభివద్ధికి సహకరించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని విన్నవించారు. తమపై దయ ఉంచి పార్లమెంట్ సభ్యుడు అశోక్ గజపతిరాజు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించేలా చూడాలన్నారు. హరినాధరెడ్డి, లక్ష్మీ,తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement