త్వరలో తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు | International services from Tirupati airport | Sakshi
Sakshi News home page

త్వరలో తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు

Jan 8 2018 2:05 AM | Updated on Oct 2 2018 7:37 PM

International services from Tirupati airport - Sakshi

రేణిగుంట: తిరుపతి విమానాశ్రయం నుంచి విదేశాలకు త్వరలోనే కనెక్టివిటీ విమాన సర్వీసులను నడిపేదిశగా చర్యలు తీసుకుంటామని కేంద్ర విమానయాన శాఖామంత్రి అశోకగజపతిరాజు అన్నారు. రేణిగుంటలోని తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన ఇండిగో విమాన సర్వీసులను లాంఛనంగా ప్రారంభించారు.

అనంతరం ఆయన బోర్డింగ్‌ కౌంటర్‌ వద్ద మొదటి ప్రయాణికునిగా ఇండిగో ప్రెసిడెంట్‌ ఆదిత్యఘోష్‌ నుంచి టికెట్టు పొందారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తిరుపతి నుంచి అంతర్జాతీయ విమానాలను నడిపేందుకు అడ్డంకిగా ఉన్న అన్ని సమస్యలను అధిగమిస్తామని తెలిపారు. ఇండిగో ప్రెసిడెంట్‌ ఆదిత్యఘోష్‌ మాట్లాడుతూ  ఆంధ్రప్రదేశ్‌లో మరో వారంలో రాజమండ్రి, మార్చి నాటికి విజయవాడ నుంచి తమ సర్వీసులను ప్రారంభిస్తామన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement