అపరిశుభ్ర వాతావరణంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న దృశ్యం
కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజుకు కోపమొచ్చింది. ప్రసంగం ప్రారంభించిన కొద్ది సేపటికే మైకు టేబుల్‌పై ఉంచి అక్కడి నుంచి బయిటకు వచ్చేశారు. అంతకు ఐదు నిమిషాల ముందే కత్తెరతో కట్ చేయాల్సిన రిబ్బన్ చేత్తో లాగేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సంఘటనలు అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులను అవాక్కయ్యేలా చేశాయి.
♦ ప్రసంగం మధ్యలో మైకు వదిలేసిన వైనం
♦ రిబ్బన్ చేత్తో లాగేసి ప్రారంభోత్సవం
♦ అపరిశుభ్ర వాతావరణంపై అసంతృప్తి
చీపురుపల్లి: కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజుకు కోపమొచ్చింది. ప్రసంగం ప్రారంభించిన కొద్ది సేపటికే మైకు టేబుల్‌పై ఉంచి అక్కడి నుంచి బయిటకు వచ్చేశారు. అంతకు ఐదు నిమిషాల ముందే కత్తెరతో కట్ చేయాల్సిన రిబ్బన్ చేత్తో లాగేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సంఘటనలు అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులను అవాక్కయ్యేలా చేశాయి. శనివారం సాయంత్రం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో రూ.73 లక్షలు సర్వశిక్ష అభియాన్ నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులు ప్రారంభోత్సవానికి వచ్చిన కేంద్ర మంత్రి పి.అశోక్‌గజపతిరాజు ప్రసంగం ఆరంభించిన నిమిషంలోనే అసహనంగా ముగించారు. ముందుగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి కిమిడి మృణాళిని ప్రసంగించిన అనంతరం కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు మాట్లాడేందుకు ఉపక్రమించారు. మైకు సమస్యో ఏమో గానీ ఆయన మాటలు చివరివారికి వినిపించ లేదు.
ఇది గమనించిన ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు కృపాప్రసాద్ సార్ మైకు దగ్గరగా పెట్టుకోండి... వినిపించడం లేదు అని చెప్పాడు. అంతే రాజుగారికి ఎక్కడ లేని కోపమొచ్చింది. మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా, మీరే మాట్లాడుకోండి అంటూ మైకు టేబుల్‌పై ఉంచి అక్కడి నుంచి బయిటకు వచ్చేశారు. అంతకుముందు తరగతి గదులు ప్రారంభోత్సం సందర్భంగా రిబ్బన్ కట్ చేసేందుకు కత్తెర ఉన్నప్పటికీ చేత్తో లాగేసి లోపలకు ప్రవేశించారు.
అంతేకాకుండా ఒక చోట ఉండకుండా అటూ, ఇటూ తిరుగుతూ అసహనంగా కనిపించారు. భవనాలు వెనుక భాగంలో అపరిశుభ్ర వాతావరణంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు కనకమహలక్ష్మి అమ్మవారి ఆలయ పరిసరాల్లో గల గజపతినగరం బ్రాంచి కాలువ వద్ద తోటపల్లి గంగకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని, విజయనగరం ఎంఎల్‌ఏ మీసాల గీత, మాజీ ఎంఎల్‌ఏ గద్దే బాబూరావు, జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, ఎంపీపీ రౌతు కాంతమ్మ, జెడ్‌పీటీసీ మీసాల వరహాలనాయుడు, మెరకముడిదాం ఎంపీపీ తాడ్డి సన్యాసినాయుడు, ఆర్‌ఈసీఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, టీడీపీ మండల అధ్యక్షుడు రౌతు కామునాయుడు తదితరులు పాల్గొన్నారు.