
రేణిగుంట: ఇండిగో విమాన సర్వీసు సంస్థ తిరుపతి విమానాశ్రయం నుంచి తమ సర్వీసులను ఆదివారం ప్రారంభించనుంది. రోజూ మూడు సర్వీసులు హైదరాబాద్‌కు, రెండు సర్వీసులు బెంగళూరుకు నడపనున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ఉదయం 9 గంటలకు ఈ సర్వీసులను ప్రారంభిస్తారు.
ఇండిగో సంస్థ ప్రెసిడెంట్ ఆదిత్యఘోష్, ఎంపీలు వెలగపల్లి వరప్రసాదరావు, శివప్రసాద్ హాజరుకానున్నారు. ఇప్పటి వరకు రేణిగుంట విమానాశ్రయం నుంచి కేవలం హైదరాబాద్, విజయవాడలకు మాత్రమే విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఎయిరిండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్, స్పైస్‌జెట్, ట్రూజెట్ కంపెనీలు మాత్రమే తమ సర్వీసులు కొనసాగిస్తున్నాయి.