ఈస్ట్ సీఐకి వినతి పత్రం ఇస్తున్న సీపీఎం,సీపీఐ నాయకులు
–తిరుపతిలో సీపీఎం, సీపీఐ ఫిర్యాదు
తిరుపతి క్రైం: కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు కన్పించడం లేదని మంగళవారం ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో సీపీఐ జనరల్ సెక్రటరీ చిన్నం పెంచులయ్య సీఐ రాంకిషోర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులుగా, ఎంతో రాజకీయ అనుభవం ఉండి కూడా ప్రత్యేక హోదాపై ఎక్కడా కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు స్పందించ లేదన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎవ్వరికీ కనపడడం లేదని, ఆయన ఏమయ్యారని రాష్ట్ర ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారన్నారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు అశోక్‌గజపతి రాజు ప్రత్యేకహోదా కోసం మాట్లాడాలని, రాష్ట్ర అభివద్ధికి సహకరించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని విన్నవించారు. తమపై దయ ఉంచి పార్లమెంట్ సభ్యులు అశోక్‌గజపతిరాజు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని రాష్ట్ర అభివద్ధికి సహకరించేలా చూడాలన్నారు. హరినాధరెడ్డి, లక్ష్మీ,తదితరులు పాల్గొన్నారు.