విశాఖకు రైల్వే జోన్ కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన పాదయాత్రకు పార్టీ ఎమ్మెల్యే రోజా సంఘీభావం తెలిపారు. రైల్వే జోన్ కోసం అమర్‌నాథ్ చేస్తున్న ఆత్మగౌరవ యాత్ర గురువారం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ పాదయాత్రలో నగరి ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్ కోసం బాధ్యతగల యువకుడిగా అమర్‌నాథ్ చేస్తున్న పాదయాత్రకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆశీస్సులున్నాయన్నారు.
Published Thu, Apr 6 2017 4:35 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement