vishaka railway zone
-
బిగ్ క్వశ్చన్ : పట్టాలు తప్పిన ఎల్లో మీడియా పచ్చ రాతలు
-
రైల్వే జోన్ పై ఎంపీ జీవీఎల్
-
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడే ఉన్నాం : రైల్వే మంత్రి
-
విశాఖ రైల్వేజోన్‌పై వైఎస్ఆర్సీపీ ఒకే మాటపై ఉంది
-
పట్టాలెక్కని బాలాజీ
రాయలసీమ రైల్వేలో కడప జిల్లా సౌత్‌సెంట్రల్ రైల్వే నుంచి విశాఖ జోన్ పరిధికి వెళ్లిపోనుంది. జిల్లా నుంచి జోన్ కేంద్రం విశాఖ చాలా దూరమని రైల్వే కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కనీసం తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ప్రతిపాదనకు జోన్లో పచ్చజెండా ఊపుతారని భావించిన వారికి నిరాశ ఎదురైంది. ఈ డివిజన్ కేంద్రంగా తిరుపతిని చేస్తే కాట్పాడి నుంచి గుంతకల్, నెల్లూరు జిల్లా గూడూరు, కడపల పరిధిలోకి సమారు 700 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఈ డివిజన్ ఆదాయం రూ.200 కోట్లు ఉంటుందని సమాచారం. 400 కిలోమీటర్లు ఉంటే డివిజన్‌గా ప్రకటించవచ్చు. అన్ని అనుకూలాంశాలు ఉన్నా బాలాజీ డివిజను ప్రస్తావన ఈసారి కూడా పట్టాలెక్కకపోవడం విచారకరం. కడప ,రాజంపేట : విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించడంపై హర్షం వ్యక్తమవుతున్నా తమ చిరకాల వాంఛ నెరవేరలేదని భావన జిల్లా రైల్వే ప్రయాణికులను..ఉద్యోగులను వేధిస్తోంది. కనీసం తిరుపతి డివిజను గురించి ఇందులో రైల్వేమంత్రి ప్రస్తావించకపోవడం ఆశలపై నీళ్లు చల్లింది. తూర్పు కోస్తా పరిధిలోని వాల్తేరు డివిజన్లో కొంతభాగం విశాఖ రైల్వేజోన్‌లో కలపడం కన్నా, తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్‌గా చేసి గుంతకల్, గుంటూరు, విజయవాడ నాలుగు డివిజన్లుగా విశాఖజోన్ పరిధిలో కలిపి ఉంటేబాగుండేదని నిపుణులు అంటున్నారు. తిరుపతి డివిజన్‌గా చేస్తే రాయలసీమ ప్రాంతానికి ఉపయోగకరంగా ఉంటుంది. తరచూ సమావేశాలకు గుంతకల్ డివిజన్ కేంద్రానికి వెళ్లి రావాలంటే అధికారులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు విశాఖ జోన్‌గా ప్రకటించడంతో మూలిగే నక్కపై తాటికాయపడ్డట్లు పరిస్ధితి మారిపోయింది. గుంతకల్ జోన్ ఆశలపై నీళ్లు.. గుంతకల్ రైల్వే డివిజన్ కుదింపులతో కుదేలవుతోంది. ఈ డివిజన్ ఉనికి ప్రశ్నార్ధకరంగా మారనుంది. ఈ డివిజన్‌ను రైల్వేజోన్ చేయాలని ఒక వైపు రాజకీయపార్టీల నాయకులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. మరోవైపు డివిజన్‌ను విభజించి ఇతర వాటిల్లోకి విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. గుల్బర్గా, తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు పరిశీలించారు. ప్రాధాన్యం ఉన్న ఈ డివిజన్‌ను ఇప్పటికే పలుసార్లు కుదించారు. ఉత్తర, దక్షిణ భారతాలను కలిపే కీలక రైల్వే జంక్షన్ గుంతకల్లు డివిజన్. ఈ రైల్వేడివిజన్‌లో 1697.90కిలోమీటర్లు లైన్లు ఉండేవి. 2003 ఏప్రిల్1న బల్లారి–హోస్పేట్, బళ్లారి–రాయదుర్గం, నంద్యాల–దొనకొండ, ధర్మవరం–సికింద్రాబాదు సెక్షన్‌లోని 367కి.మీలైన్లను గుంటూరు, హుబ్లీ, బెంగళూరు డివిజన్‌లోకి విలీనం చేశారు. ప్రస్తుతం డివిజన్ పరిధిలో 1330.90కీ.మీల ట్రాక్ మాత్రమే ఉంది. బాలాజీ డివిజన్ ఏర్పాటైతే.. బాలాజీ డివిజన్ ఏర్పాటైతే ఇందులో తిరుపతి–గూడూరు (92.96కి.మీ), తిరుపతి–కాట్పాడి (104.39కి.మీ), పాకాల–మదనపల్లె(83కి.మీ), రేణిగుంట–కడప (125కి.మీ)లైను కలిపే అంశాన్ని గతంలో అధికారులు పరిశీలించారు. నంద్యాల–పెండేకల్లు (102 కి.మీ) లైను గుంటూరు డివిజన్‌లోకి విలీనం చేయాలని యోచిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన కర్ణాటకలోని గుల్బర్గా డివిజన్‌లోకి వాడి–రాయచూరు (107.48కిమీ) సెక్షన్‌ను కలపడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో దాదాపు 614.83కిమీ లైన్లను ఇతర డివిజన్ వెళ్లనున్నాయి. చివరికి గుంతకల్లు డివిజన్‌కు 716.07 కిమీల ట్రాక్ మాత్రమే మిగులుతుంది. నందలూరుకు పూర్వవైభవం.. బాలాజి డివిజన్ ఏర్పడితే నందలూరు పూర్వవైభవం సంతరించుకుంటుంది.. రైల్వేమంత్రిగా పనిచేసిన లాలూ హయాంలో నందలూరులో రైల్వే ప్రత్యామ్నాయ పరిశ్రమను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. కోచ్ రిహాబిటేషన్ వర్క్‌షాపు గానీ వ్యాగగన్ రిపేరు వర్క్‌షాపు గాని ఏర్పాటుదిశగా ప్రయత్నాలు జరిగాయి. నందలూరుకు ఈ పరిశ్రమ వస్తే డివిజన్ కేంద్రం గుంతకల్ ప్రాధాన్యత తగ్గిపోతుందని భావనలు పుట్టుకొచ్చాయి. దీంతో నందలూరు కు రైల్వేపరిశ్రమ రాకుండా కొందరు రైల్వే ఉన్నతాధికారులు అడ్డుకున్నారనే ఆరోపణలు గుప్పమన్నాయి. తప్పుడు నివేదికలు రైల్వేబోర్డుకు పంపించారని విమర్శలున్నాయి. ఇప్పుడు విశాఖ జోన్ ఏర్పడిన నేపథ్యంలో గుంతకల్ డివిజన్ నుంచి వేరుచేసి కడప వరకు బాలాజీడివిజన్గా ఏర్పాటుచేసే ప్రతిపాదన కార్యరూపం దాల్చేందుకు పాలకులు నడుంబిగించాల్సిన అవసరం ఉంది. -
ఆదాయం లేని జోన్!
ఆంధ్రప్రదేశ్ ప్రజల... ప్రత్యేకించి ఉత్తరాంధ్రవాసుల చిరకాల వాంఛ నెరవేరింది. దశాబ్దాలుగా వారు కోరుకుంటున్న రైల్వే జోన్ ఎట్టకేలకు సాకారమైంది. కానీ ఎప్పటిలాగే వారికి అసంతృప్తే మిగిలింది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తున్నట్టు బుధవారం రాత్రి రైల్వేమంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. కానీ అది నామమాత్రమైనదేనని కొద్దిసేపటికే ప్రజలందరికీ అర్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నానికి రెండ్రోజుల్లో వస్తారనగా, ఒకటి రెండు రోజుల్లో జమిలి ఎన్నికల నగారా మోగబోతుండగా ప్రకటించిన ఈ రైల్వేజోన్ వేరు... రాష్ట్ర ప్రజలు ఇన్ని దశా బ్దాలుగా కోరుకుంటున్న రైల్వే జోన్ వేరు. విశాఖ కేంద్రంగా కొత్తగా ఏర్పడే దక్షిణ కోస్తా రైల్వే జోన్లో గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లుంటాయి. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్లోని ఒక భాగం విజయవాడ డివిజన్‌లోకి విలీనం చేస్తుండగా, మరో భాగాన్ని రాయగడ కేంద్రంగా ఏర్పాటు కాబోయే డివిజన్‌కు తీసుకెళ్తున్నారు. ఆ డివిజన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో ఉంటుంది. ఏతావాతా మూడు నెలలక్రితం 125వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్న వాల్తేరు డివిజన్ కాస్తా మాయం కాబోతోందన్న మాట! రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకోసం కేంద్రంపై ఒత్తిళ్లు తీసుకురాగలిగే సత్తాలేని పాలకులు రాష్ట్రాన్ని ఏలుతున్నప్పుడు ఈ దుస్థితి తప్పదు. వాల్తేరు డివిజన్ మాయం కావడం కేవలం భావోద్వేగపరమైన అంశం మాత్రమే కాదు...కొత్త రైల్వే జోన్‌కు ఆర్థికంగా కష్టాలు తెచ్చిపెట్టే అంశం కూడా. రద్దవుతున్న వాల్తేరు డివిజన్ ఏటా భారీగా ఆదాయాన్ని గడించేది. ఆ విషయంలో అది దేశంలోనే అయిదో స్థానంలో ఉంది. వాల్తేరు డివిజన్లో ఉన్న కొత్తవలస–కిరండోల్ లైన్(కేకే లైన్), కోరాపుట్–రాయగడ లైన్(కేఆర్ లైన్)లు రెండూ ఆదాయం రీత్యా అత్యంత కీలకమైనవి. బైలదిల్లా గనుల నుంచి విశాఖలోని రెండు ఓడ రేవులకూ రవాణా అయ్యే ఇనుప ఖనిజం వల్లే ఈ స్థాయి ఆదాయం లభిస్తోంది. నిరుడు వాల్తేరు డివిజన్ రూ. 7,500 కోట్లకుపైగా ఆదాయాన్ని గడించింది. కానీ తాజా నిర్ణయం ప్రకారం ప్రయాణికుల ద్వారా లభించే ఆదాయం విశాఖ కేంద్రంగా ఏర్పడే రైల్వే జోన్‌కూ... సరుకు రవాణా ద్వారా వచ్చే ఆదాయం భువనేశ్వర్ జోన్‌లోని రాయగడ డివిజన్‌కూ వెళ్తాయి. కానీ కేకే లైన్ పరి ధిలో అరకు వరకూ ఉన్న రైలు మార్గం నిర్వహణ భారం మాత్రం విశాఖ జోన్‌కు బదిలీ అవుతుంది. బైలదిల్లా గనులు ఒడిశా పరిధిలో ఉంటే... అక్కడి ఖనిజం విశాఖ ఓడరేవులకు రవాణా అవు తుంది. కనుక సమన్యాయం చేయదల్చుకుంటే ఇనుప ఖనిజం రవాణా ద్వారా లభించే ఆదా యాన్ని భువనేశ్వర్, విశాఖ రైల్వే జోన్లకు చెరి సగం పంచాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల వాంఛను సాకారం చేస్తున్నామని సగర్వంగా చెప్పుకుంటూ కూడా కేంద్రం ఆ దిశగా ఆలోచిం చకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. విశాఖ రైల్వే జోన్ కావాలన్న ఉద్యమం బలం పుంజుకున్నకొద్దీ ఒడిశానుంచి కేంద్రంపై ఒత్తిళ్లు తీవ్రమయ్యాయి. వాల్తేరు డివిజన్‌ను తొలగిస్తే తమ తూర్పు కోస్తా రైల్వే చతికిలబడుతుందని, దీన్ని తాము సహించబోమని నాలుగేళ్లక్రితమే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కేంద్రాన్ని హెచ్చరించారు. అప్పట్లో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీతో అంటకాగిన చంద్రబాబు ఈ అంశంలో నోరెత్తలేదు. విశాఖ రైల్వే జోన్ తమ హక్కని, అందులో వాల్తేరు డివిజన్ ఉండితీరాలని గొంతెత్తి చెప్పాల్సి ఉండగా, కేంద్రంలో తన పలుకుబడిని ఉపయోగించి అది వెనువెంటనే సాకారం కావడానికి కృషి చేయాల్సి ఉండగా ఆయన నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. బీజేపీకి దూరంగా ఉంటూనే నవీన్ పట్నాయక్ పంతం నెగ్గించుకోగా బాబు మాత్రం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు ఎగనామం పెట్టారు. ఇంకా వెనక్కు వెళ్తే... ఆగ్నేయ రైల్వేలో భాగంగా కొనసాగుతూ వస్తున్న విశాఖ డివిజన్ 2003లో భువనేశ్వర్ జోన్ పరిధిలోకి బదిలీ అయింది. ఆ సమయానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఖర్మ కాలి చంద్రబాబే ముఖ్యమంత్రి. అప్పుడు సైతం ఆయన బీజేపీతో కాపురం చేస్తూ కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు. అప్పట్లో ఆయన గట్టిగా పట్టుబట్టి ఉంటే వాల్తేరు డివిజన్ భువనేశ్వర్ జోన్‌కు పోకుండా కొత్తగా ఏర్పడే విశాఖ రైల్వే జోన్లో భాగమయ్యేది. ఇంకా దిగ్భ్రాంతికరమైన విషయమేమంటే... వాల్తేరు డివిజన్‌ను తూర్పు కోస్తా రైల్వేకు వదిలిపెడితేనే ఏపీకి కొత్త రైల్వే జోన్ మంజూరు చేస్తామని 2016 సెప్టెంబర్‌లో కేంద్రం మెలిక పెట్టినప్పుడు ‘ఇతరత్రా రాష్ట్ర ప్రయోజనాల కోసం’ అందుకు చంద్రబాబు అంగీకరించారని ఆయన అనుకూల మీడియానే కథనాలు రాసింది. ఇన్నివిధాలుగా జనం ప్రయోజనాలు తాకట్టుపెట్టి ఇప్పుడు ఏం ఎరగనట్టు కేంద్రంపై విమర్శలు గుప్పించడం తెలుగుదేశానికే చెల్లింది. ఏపీకి కొత్త రైల్వే జోన్ రావడం ఇంత సంక్లిష్టమైన సమస్యగా మారడం, అందుకోసం నాలుగున్నరేళ్లుగా జనం ఉద్యమించాల్సి రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 1951నాటికి దేశంలో కేవలం ఆరు రైల్వే జోన్లు ఉంటే, ఆ మరుసటి ఏడాదికే అవి 9 కి చేరాయి. ఆ తర్వాత మరో రెండు కొత్త జోన్లు ఆవిర్భవించి అవి 11కు పెరగ్గా, 2003 నాటికి అవి 17 అయ్యాయి. ఈ రైల్వే జోన్లలో చాలావాటికి రాజకీయ పరమార్ధమే తప్ప శాస్త్రీయ ప్రాతిపదిక లేదు. కానీ వాల్తేరు డివిజన్‌కు రైల్వే జోన్‌గా మారడానికి అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నా... దశా బ్దాలుగా ఏపీ ప్రజలు కోరుతున్నా... విభజన సమయంలో వాగ్దానం చేసినా అది సాకారం కావ డానికి ఇన్నేళ్లు పట్టింది. కానీ ఏం లాభం? దానికి న్యాయంగా దక్కాల్సిన ఆదాయ వనరుల్ని తెగ్గోసి, భారాన్ని మాత్రం దండిగా మోపారు. దీన్ని సరిచేయడంతోపాటు విభజన వాగ్దానాల్లో ఒకటైన ప్రత్యేక హోదాకు సైతం ఆమోదముద్ర వేసి ఎన్డీఏ ప్రభుత్వం తన బాధ్యతను నెర వేరుస్తుందని ఆశిద్దాం. -
‘ఏ పార్టీలో చేరేది వచ్చేవారం ప్రకటిస్తా’
సాక్షి, విజయవాడ : మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ గురువారం వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర సమస్యలపై ఉమ్మారెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం కొణతాల మాట్లాడుతూ.. విశాఖకు రైల్వే జోన్ వచ్చిందని సంతోషపడాలో.. బాధపడాలో తెలియడం లేదన్నారు. రైల్వే జోన్ ఇచ్చినట్లే ఇచ్చి విశాఖ డివిజన్‌ను తీసేయడం సరి కాదన్నారు. ఉత్తరాంధ్ర సమస్యలపై అన్ని పార్టీలకు నివేదిక ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో ఉత్తరాంధ్ర సమస్యలను చేర్చాలని కోరారు. రాజకీయాల కంటే కూడా ఉత్తరాంధ్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని కొణతాల స్పష్టం చేశారు. ఏ పార్టీలో చేరే అంశం గురించి వచ్చే వారం ప్రకటిస్తానని తెలిపారు. -
పోరాట యోధుడి ప్రతిఫలం
‘నువ్వెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’.. రైళ్ల సమయపాలన విషయంలో ఎప్పటినుంచో ఉన్న నానుడి ఇది. యాధృచ్ఛికమే గానీ.. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు విషయంలో ఈ నానుడి నిజమైంది. విశాఖతోపాటు ఉత్తరాంధ్రవాసుల దశాబ్దాల కల ఈడేరింది. సుదీర్ఘ పోరాటాలు ఫలించాయి. ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు ఎట్టకేలకు సాకారమైంది. మొదట కోల్‌కతా కేంద్రంగా ఉన్న ఆగ్నేయ రైల్వేలోనూ.. అనంతరం భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పుకోస్తా రైల్వే జోన్‌లోనూ వాల్తేర్ డివిజన్‌కు జరుగుతున్న అన్యాయాలతో విసిగివేసారిన ఉత్తరాంధ్ర ప్రజలు దశాబ్దాలనాడే విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ డిమాండ్‌తో గళమెత్తారు. కీలకమైన రైల్వే ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రాంతాలకు తరలించుకుపోవడం.. రైలు సర్వీసులను పొడిగించుకొని వాల్తేర్ సీట్ల కోటాకు ఎసరుపెట్టడం.. కొత్త కోచ్‌లు, ఇంజిన్లు తమ ప్రాంతాల్లో అట్టిపెట్టుకొని, వాల్తేర్‌కు పాతవి అంటగట్టడం.. వంటి వివక్షపూరిత చర్యలు ప్రత్యేక జోన్ వాదనను పదునెక్కించాయి..ఇక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలకు వెళ్లే ఆంధ్ర నిరుద్యోగులను అక్కడి కేంద్రాల్లో పరీక్షలు రాయకుండా అడ్డుకోవడం, కొట్టడం వంటి సంఘటనలు.. జోన్ ఉద్యమాన్ని ఉడుకెక్కించాయి. ప్రత్యేక జోన్ ఏర్పాటుకు అప్పుడప్పుడూ కొన్ని ప్రయత్నాలు జరిగినా.. మన ప్రజాప్రతినిధుల మెతకదనం, అప్పటి ఆగ్నేయ, ప్రస్తుత తూర్పుకోస్తా రైల్వేలకు ఆదాయపరంగా బంగారు బాతులా ఉన్న వాల్తేర్ డివిజన్‌ను వదులుకోవడం ఇష్టంలేక ఆ రాష్ట్రాలు మోకాలడ్డటం.. వంటి చర్యలు రైల్వేజోన్ ఏర్పాటు ప్రక్రియకు ఎప్పటికప్పుడు రెడ్ సిగ్నల్ వేశాయి. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా రూపొందించిన విభజన చట్టంలో విశాఖ రైల్వేజోన్ ఇస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చినా.. సాంకేతిక ఇతరత్రా సాకులతో ఎప్పటికప్పుడు దాటవేస్తుండటాన్ని నిరసిస్తూ.. రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఉద్యమించారు.. ఆ తర్వాత దాన్ని అందిపుచ్చుకున్న ఆ పార్టీ నేతలు ఎంపీ విజయసాయిరెడ్డి, గుడివాడ అమర్నాథ్లు కూడా పాదయాత్రలు, నిరవధిక దీక్షలతో రైల్వేజోన్ డిమాండ్‌ను ఎలుగెత్తిచాటారు. ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కేంద్రం పచ్చజెండా ఊపడంతో ఆలస్యంగానైనా విశాఖ రైల్వేజోన్ పట్టాలెక్కింది. విశాఖసిటీ: నాటి స్వాతంత్య్రోద్యమం నుంచి.. మొన్నటి విశాఖ ఉక్కు సంకల్పం.. నిన్నటి జై ఆంధ్ర.. సమైక్యాంధ్ర పోరాటాలు.. వీటన్నింటికీ నాయకత్వం వహించిన వారు స్వాతంత్య్ర యోధులు, మేధావులు వంటి మహోన్నతులు. అదే స్ఫూర్తి.. అదే ఉక్కు సంకల్పం.. నేటి రైల్వేజోన్, ప్రత్యేక హోదా ఉద్యమానికి దారి చూపిన జాజ్వల్యమైన దీప్తి..కానీ.. ఈ ఉద్యమాన్ని నడిపించింది.. నడిపిస్తున్నది మాత్రం ఒకే ఒక్కడు. మడమతిప్పని యోధుడు.రెండు ప్రధాన డిమాండ్లతో అతడే సైన్యమై జోన్ కోసం పోరాటం చేస్తూ.. రాష్ట్ర ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ.. విజయం వైపు నడిపించిన ధీరుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెంచుకున్న ఆశలు రెండింటిపైనే.. ఒకటి ప్రత్యేక హోదా.. రెండోది విశాఖ రైల్వేజోన్. విభజన హామీలు సాధించే విషయంలో అధికార పార్టీ గుంభనంగా వ్యవహరించడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట నెరవేర్చకుండా కాలయాపన చేసింది. ఏడాది గడిచినా రాష్ట్రానికి ఏమీ విదిల్చకపోవడం.. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిచడంతో.. ఉద్యమ భారాన్ని తన భుజస్కందాలపై వేసుకొని మొదటి అడుగు వేశారు ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. హోదాతో పాటు రైల్వో జోన్ సాధించే పోరుకు శంఖారావం పూరించారు. ఆయన వేసిన అడుగు.. ప్రభంజనమైంది. సామాన్యులు, ప్రజా సంఘాలు, ఇతర రాజకీయ పార్టీల్లో చైతన్యం నింపింది. జోన్ ఆవశ్యకత, హోదా వస్తే లాభాల గురించి ఏపీలోని ప్రతి పౌరుడూ తెలుసుకునే విధంగా చైతన్యవంతం చేసిన జగన్మోహన్రెడ్డి ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. పార్లమెంట్ లోపలా, బయటా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూ పోరాటాలు సాగించారు. ఆయన స్ఫూర్తితో వాడవాడలా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. విద్యార్థి, ఉద్యోగ, ప్రజా సంఘాలు, రాజకీయ, రాజకీయేతర నేతలు.. ఇలా అందరూ.. జగన్ పోరాటంతో స్ఫూర్తి పొందుతూ.. జోన్ కోసం అనేక ఉద్యమాలు చేశారు. అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా జోన్ కోసం దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు.. ఇలా ప్రతి పోరాటం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చారు. జగన్ స్ఫూర్తితో సాగిన ఐదేళ్ల పోరాటానికి ప్రతిఫలం దక్కింది. ఉత్తరాంధ్ర వాసులు ఎన్నాళ్ల నుంచో ఆశగా ఎదురు చూస్తున్న విశాఖ రైల్వేజోన్ కల సాకారమైంది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ బుధవారం రాత్రి ప్రకటించారు. ఇది ప్రజా విజయం.. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తూ.. రైల్వేజోన్ సాధనలో కీలక పాత్ర పోషించిన వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ విజయం. జోన్ కోసం ‘విజయ’ యాత్ర స్థానికంగా పేరుకుపోయిన సమస్యలు తీరడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక నిరాశలో కుంగిపోయిన యువతకు ధైర్యం చెబుతూ.. జోన్ సాధనే లక్ష్యంగా పాదయాత్ర చేసిన వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జోన్ సాధనలో కీలక పాత్ర పోషించారు. ఏడు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తూ.. ప్రతి ఒక్కరిలో జోన్ గురించి చైతన్యపరచడంలో ఆయన ముఖ్య భూమిక పోషించారు. జోన్ విషయంలో వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేస్తూ.. చేపట్టిన రాస్తారోకోలు, ర్యాలీలు, ధర్నాల్లో పాల్గొన్నారు. రాజ్యసభలో జోన్ ప్రస్తావనను పదే పదే తీసుకొస్తూ... కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. విశాఖ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే.. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావాల్సిందేనంటూ పదే పదే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లేలా పార్లమెంట్లో ఉద్యమించిన విజయసాయిరెడ్డి.. జోన్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. జగనన్న బాటలో అమర్ వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలతో ఆయన మార్గదర్శకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ప్రస్తుత అనకాపల్లి సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్.. రైల్వేజోన్ కోసం సుదీర్ఘ పోరాటం చేశారు. అలుపెరగని ధీరుడు సంకల్పాన్ని స్ఫూర్తిగా తీసుకొని.. నెల రోజుల్లో జోన్ ప్రకటించకుంటే ఆమరణ దీక్ష చేస్తానని అల్టిమేటం జారీ చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో 2016 ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆమరణ దీక్ష చేపట్టారు. ఐదురోజుల పాటు దీక్ష సాగిన నేపథ్యంలో ఏప్రిల్ 18న వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షకు హాజరయ్యారు. జోన్‌పై పోరాటం ఉద్ధృతం చేసేందుకు అన్ని వర్గాలతో కలిసికట్టుగా పోరాటం చెయాల్సిన అవసరం ఉందంటూ జగన్మోహన్రెడ్డే స్వయంగా నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అప్పటి నుంచి రైల్ రోకోలు, రాస్తారోకోలు, జాతీయ రహదారుల దిగ్బంధనాలు, ధర్నాలు, సమ్మెలు నిర్వహించిన అమర్నాథ్.. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 2017 మార్చి 30 నుంచి ఏప్రిల్ 9 వరకూ 200 పై చిలుకు కిమీ పాదయాత్ర చేస్తూ.. రైల్వేజోన్ వస్తే.. ఎలాంటి ఉపయోగం ఉంటుంది, యువతకు ఎలా ఉపాధి అవకాశాలు వస్తాయి. విశాఖతో పాటు ఇతర ప్రాంతాలు ఎలా అభివృద్ధి అవుతాయనే అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి.. జోన్ సాధనలో కీలక పాత్ర పోషించారు. -
విశాఖ కేంద్రంగా రైల్వేజోన్.. కేంద్రం కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న విశాఖ రైల్వే జోన్‌కు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. విశాఖ కేంద్రంలో నూతన రైల్వేజోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ అధికారికంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని షెడ్యూల్ 13 ఎనిమిదో ఆర్టికల్ ప్రకారం విశాఖ కేంద్రంగా సౌత్‌కోస్ట్ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. గుంటూరు, విజయవాడ, గుంతకుల్లు డివిజన్లతో నూతన జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతమున్న వాల్తేరు డివిజన్‌ను రెండు భాగాలుగా విభజించనున్నారు. పూర్తి వివరాలను రైల్వేశాఖ అధికారులతో చర్చించిన అనంతరం వెల్లడిస్తామని గోయల్ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఈమేరకు రైల్వేజోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 1న విశాఖ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో రెండురోజుల ముందు కేంద్ర ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. కాగా విశాఖ రైల్వే జోన్ ప్రకటనతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికను కేంద్ర ప్రభుత్వం తీర్చినట్లయ్యింది. కాగా గత నాలుగేళ్లుగా విశాఖ రైల్వేజోన్ కోసం వైఎస్సార్సీపీ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఫలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాటం.. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వాలనీ, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పోరాటానికి ఎట్టకేలకు ఫలితం దక్కింది. వీటీపై ఆయన పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఏపీ కేంద్రంగా వైఎస్సార్సీపీ అనేక ఉద్యమాలను చేపట్టింది. పార్లమెంట్ వేదికగా పార్టీ ఎంపీలు చేసిన కృషికి ఫలితంగా.. విశాఖ రైల్వే జోన్ ప్రకటిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జోన్ ప్రకటనపై పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. -
రైల్వే జోన్ సాధన కోసం నిరసన రాత్రి
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించాలన్న డిమాండ్‌తో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన రాత్రి కార్యక్రమం చేపట్టారు. జ్ఞానాపురం వైపు ఉన్న రైల్వే స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు సాగిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైల్వేజోన్ అంశం దాదాపు 30 ఏళ్లుగా నడుస్తోందన్నారు. ఇది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అని, బోర్డు చైర్మన్ కూడా ఇది పొలిటికల్ విషయమని తెలియజేశారని గుర్తు చేశారు. వుడా మాజీ చైర్మన్ ఎస్.ఎ.రహమాన్ మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం వచ్చి పోరాడినప్పుడు జోన్ తప్పక వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ గత ఎన్నికల సభలో మోడీ ఎన్నో హామీలు ఇచ్చారని, అందులో రైల్వే జోన్ ఒకటని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు దానిని బీజేపీ నాయకులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఎన్జీవో జిల్లా ప్రెసిడెంట్, నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్, కె.ఈశ్వరరావు, ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ రక్షణ వేదిక కన్వీనర్ ఎస్.ఎస్.శివశంకర్, వీజేఎఫ్ అధ్యక్షుడు శ్రీనుబాబు, ప్రత్యేక రాష్ట్ర పోరాట సమితి జి.ఎ.నారాయణరావు పాల్గొన్నారు. వేదికపై కూచిపూడి నాట్యం, మిమిక్రీ, మేజిక్‌షో, పేరడీ సాంగ్స్ తదితర పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
అశోక్ గజపతిరాజు పౌరుషం ఏమైంది
-
అశోక్ గజపతిరాజు పౌరుషం ఏమైంది: రోజా
విశాఖ : విశాఖకు రైల్వే జోన్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన పాదయాత్రకు పార్టీ ఎమ్మెల్యే రోజా సంఘీభావం తెలిపారు. రైల్వే జోన్ కోసం అమర్నాథ్ చేస్తున్న ఆత్మగౌరవ యాత్ర గురువారం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ పాదయాత్రలో నగరి ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్ కోసం బాధ్యతగల యువకుడిగా అమర్నాథ్ చేస్తున్న పాదయాత్రకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆశీస్సులున్నాయని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీపై రోజా నిప్పులు చెరిగారు. ‘టీడీపీ ఎంపీలు దద్దమ్మల్లా పదవులు పట్టుకుని పాకులాడుతున్నారు. రాజీనామాలు చేసి ప్రజల తరఫున పోరాడలేరా?. కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు పౌరుషం ఏమైంది. మోదీ కేబినెట్లో నోరు మూసుకుని ఉన్నారు. పదవులు కాదు...ప్రజల ఆకాంక్ష ముఖ్యం. కేంద్రంలో భాగస్వామ్యంగా ఉంటూ పదవులు పొందటంవల్లే కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారు. ఈ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు పేపర్ల లీక్, మరోమంత్రి నారాయణకు ర్యాంకులపై ఉన్న శ్రద్ధ రైల్వేజోన్, ప్రత్యేక హోదాపై లేదు. వియ్యంకులు ఇద్దరికి ల్యాండ్ పూలింగ్ కుంభకోణంపై ఉన్న శ్రద్ధ విశాఖ ప్రాంత ప్రయోజనంపై లేదు. బ్యాంకు రుణాల కేసులో బయటపడేందుకు గంటాకు కేంద్రంలో పెద్దల కాళ్లు పట్టుకునేందుకే టైమ్ సరిపోతోంది. అందుకే రైల్వే జోన్‌పై ఆయన మాట్లాడరు. మరో మంత్రి అయ్యన్నపాత్రుడుకు బాక్సైట్, గంజాయి రవాణాపై ఉన్న శ్రద్ధ రైల్వే జోన్‌పై లేకపోవడం దురదృష్టకరం. ఇక జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేకి విశాఖ ప్రాంత ప్రయోజనాలు పట్టవు. అసెంబ్లీ సమావేశాలో వైఎస్ జగన్‌తో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తిట్టించడానికి ఆయన్ని టీడీపీ సర్కార్ పావుగా వాడుకుంటోంది. అనవసరం అయిన విషయాల్లో నోరు పారేసుకోవడం మాత్రం చూస్తుంటాం కానీ, రైల్వే జోన్‌పై మాత్రం మాట్లాడరు. మంత్రి పదవులు రాలేదని టీడీపీ నేతలు రాజీనామాలు చేశారు. అదే ప్రత్యేక హోదా, రైల్వేజోన్ కోసం ఎప్పుడైనా రాజీనామాలకు సిద్ధపడ్డారా?. బీసీ, మహిళలపై చంద్రబాబు వివక్ష చూపుతున్నారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పీతల సుజాతను మంత్రి పదవి నుంచి తొలగించారు. లాస్ట్ ర్యాంక్ వచ్చిన నారాయణకు అదనపు శాఖ అప్పగించారు. ప్రజలతో ఎన్నికకాని లోకేశ్‌కు ప్రాముఖ్యం ఉన్న శాఖలిచ్చారు. మంత్రుల సంఖ్యను పెంచి, మహిళల సంఖ్యను తగ్గించారు.’ అంటూ కడిగిపారేశారు. -
అశోక్ గజపతిరాజు పౌరుషం ఏమైంది: రోజా
-
3వ రోజుకు చేరిన గుడివాడ అమర్నాథ్ పాదయాత్ర