సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనూ భూకబ్జాలు జరుగుతున్నాయని విశాఖపట్నం జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీలో భూ కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేబినెట్ ఆమోదం లేకుండా మెడ్‌టెక్ అంచనా వ్యయాన్ని రూ.2400 కోట్లకు పెంచేశారని ఆరోపించారు. అవినీతి జరిగిందని మెడ్‌టెక్ డైరెక్టర్లే ఆరోపిస్తూ ప్రిన్సిపల్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారని తెలిపారు. గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టనపెట్టుకుంది చంద్రబాబు కాదా అని అమర్నాథ్ ప్రశ్నించారు.