‘రామతీర్థం’ చైర్మన్‌ పదవి నుంచి గజపతిరాజు తొలగింపు | Ashok Gajapathi Raju Removed From Post Of Chairman Of Ramatirtha Temple | Sakshi
Sakshi News home page

ఛైర్మన్‌ పదవి నుంచి అశోక్‌ గజపతిరాజు తొలగింపు

Published Sat, Jan 2 2021 6:14 PM | Last Updated on Sat, Jan 2 2021 6:48 PM

Ashok Gajapathi Raju Removed From Post Of Chairman Of Ramatirtha Temple - Sakshi

సాక్షి, విజయవాడ: రామతీర్థం దేవస్థానం ఛైర్మన్‌ పదవి నుంచి అశోక్‌ గజపతిరాజును తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ నిర్వహణలో వైఫల్యం చెందిన నేపథ్యంలో పదవి నుంచి తొలగిస్తూ దేవాదాయశాఖ కార్యదర్శి గిరిజాశంకర్‌ మెమో జారీ చేశారు. రామతీర్ధం సహా 3 ఆలయాల ఛైర్మన్ల పదవి నుంచి ఉద్వాసన పలికింది. పైడితల్లి, తూర్పుగోదావరి జిల్లా మందపల్లి దేవస్థానాల ఛైర్మన్‌ పదవుల నుంచి తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. (చదవండి: పప్పునాయుడు సవాల్‌కు మేం రెడీ..)

కాగా, రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలో డిసెంబర్‌ 28వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు శ్రీరాముని విగ్రహం శిరస్సు తొలగించి, సీతమ్మవారి కొలనులో పడేసిన సంగతి తెలిసిందే.. ఈ సంఘటనపై ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయం పలు అనుమానాలకు తావిస్తోంది. (చదవండి: అయ్యో... రామ‘చంద్ర’!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement