Ramatirtham temple
-
రామతీర్థం ఆలయానికి 22న శంకుస్థాపన
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్థం శ్రీకోదండ రామస్వామి ఆలయ పునః నిర్మాణానికి ఈ నెల 22వ తేదీన శంకుస్థాపన జరగనుంది. బోడికొండపై పాత ఆలయం ఉన్న చోటే రూ.3 కోట్ల ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయబోతోంది. 22వ తేదీ ఉదయం 10.08 గంటలకు జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్, కమిషనర్ హరిజవహర్‌లాల్ తదితరులు పాల్గొంటారని అధికారులు తెలిపారు. చదవండి: ఉనికే లేని ఓఆర్ఆర్కు ఉరా? మెట్ల మార్గం, కోనేరు ఆధునికీకరణ.. కొండపై ఉన్న ఆలయంలోని శ్రీరాముని విగ్రహాన్ని గతేడాది డిసెంబరు 28వ తేదీ అర్ధరాత్రి కొందరు దుండగులు తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విగ్రహాల ప్రతిష్టతో పాటు ఆలయం మొత్తాన్నీ పునః నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. కొండ రాయితో ఉండే పాత ఆలయం స్థానంలో డ్రస్డ్ గ్రానైట్ రాయితో అభివృద్ధి చేస్తారు. గర్భాలయంతో పాటు ఆలయ మండపం, ధ్వజస్తంభం, ప్రాకారాన్ని కూడా పునః నిర్మించబోతున్నారు. ఆలయ ప్రాంగణంలోని కోనేరును పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తారు. భక్తులు పొంగళ్లు వండుకునేందుకు వీలుగా కొండపైన ఆలయ ప్రాంగణంలోనే పాకశాలను ఏర్పాటు చేయనున్నారు. ఇంతకుముందు భక్తులు పొంగళ్లను కొండ దిగువున వండి, వాటిని కొండపైకి మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. వీటికి తోడు కొండపైకి వెళ్లేందుకు ఇబ్బందికరంగా మారిన మెట్ల మార్గాన్ని కూడా ఆధునీకరిస్తారు. ఆగమ సంప్రదాయాలకు అనుగుణంగా డిజైన్లు.. ఆగమ సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ పునః నిర్మాణానికి దేవదాయ శాఖ, ఇంజినీరింగ్ అధికారులు డిజైన్లు సిద్ధం చేశారు. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది. అవసరమైన గ్రానైట్ రాయిని కాంట్రాక్టర్ ఇప్పటికే ఆలయ ప్రాంగణం వద్దకు తరలించారు. పెద్దపెద్ద గ్రానైట్ రాళ్లు, ఇతర నిర్మాణ సామగ్రిని 600 అడుగుల ఎత్తులో ఉండే కొండపైకి సులభంగా తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ఒక ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. శంకుస్థాపన తర్వాత 6 నెలల వ్యవధిలోనే పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు దేవదాయ శాఖ అధికారి వాణీ మోహన్ తెలిపారు. -
ప్రభుత్వంపై కక్షతోనే దుశ్చర్య: సీఐడీ
సాక్షి, విజయనగరం: రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణ చేపట్టింది. రామతీర్ధం బోడుకొండను సీఐడీ అడిషనల్ డీజీ సునీల్‌కుమార్ మంగళవారం పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఘటన జరిగిన విధానం చూస్తుంటే ఎవరో కావాలనే చేసినట్టు ఉందని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం, ప్రభుత్వంపై కక్షతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. రాముడి విగ్రహం ధ్వంసం చేసేందుకు ఉపయోగించిన రంపం దొరికిందని, అనేక ఆధారాలు సేకరించామని వెల్లడించారు. ఆలయంలో ఉన్న ఆభరణాలు గాని, వస్తువులు గాని దొంగతనం జరగలేదని, రాజకీయాలు చేయడానికే ఘటనకు పాల్పడ్డారన్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుందని.. దోషులను త్వరలోనే పట్టుకుంటామని సీఐడీ అడిషనల్ డీజీ సునీల్‌కుమార్ తెలిపారు. (చదవండి: మతాలతో ఆటలా..: సజ్జల రామకృష్ణారెడ్డి) -
రామతీర్థం ఘటనపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ: రామతీర్ధం ఘటనపై సీఐడీ విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో దేవాదాయ, పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిజా శంకర్, దేవాదాయ శాఖ స్పెషల్ కమిషనర్ అర్జునరావు, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్లు, ఆర్ జేసీలు, డీసీలు హాజరయ్యారు. రామతీర్థం ఘటన తో పాటు దేవాలయాలపై జరుగుతున్న దాడులపై అధికారుల నుంచి వివరాలను అడిగి మంత్రి తెలుసుకున్నారు. (చదవండి: కూల్చే సంస్కృతి టీడీపీదే: జయరామ్) ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. రామతీర్థం రాముడు విగ్రహం పున:ప్రతిష్ఠపై చర్చించారు. అధికారులు, పండితుల అభిప్రాయాలను మంత్రి తీసుకున్నారు. నెల రోజుల్లో రాముడు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 వేల దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.(చదవండి: విగ్రహాల ధ్వంసం: దీని వెనక ఉన్నది టీడీపీనే) చిన్న చిన్న దేవాలయాల్లోనూ కూడా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ఆలయాల్లో సీసీ కెమెరాలు, మెటల్ డోర్ డిటెక్టర్స్ తో తనిఖీలు, ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు జరిగిన దేవాలయాలపై దాడుల వెనుక కుట్ర కోణం దాగి ఉందని మంత్రి వెల్లంపల్లి అభిప్రాయం వ్యక్తం చేశారు. రామతీర్ధం ఆలయంలో జరిగిన ఘటన దురదృష్డకరమని, దీని వెనుక కుట్రకోణాలు కనిపిస్తున్నాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో లబ్ధి కోసమే బాబు కుట్రలు.. సమీక్ష అనంతరం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. రామతీర్ధం ఘటనపై సీఎం వైఎస్ జగన్... ఇప్పటికే సీఐడీ విచారణకి ఆదేశించారని, రామతీర్థం ఆలయాన్ని పూర్తిగా ఆధునీకరించాలని సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. ‘‘అధికారులు రూపొందించిన డిజైన్ని ఆమోదించాం. ఆగమ పండితులతో చర్చించాం. విగ్రహాన్ని ఎప్పుడు పునఃప్రతిష్ట చేయాలో మరోసారి ఆగమ పండితులతో చర్చించి రెండు రోజులలో ప్రకటిస్తాం.రామతీర్థం దోషులనను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. బీజేపీ ర్యాలీ విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రామతీర్థం చాలా చిన్న ప్రాంతం. ఎక్కువ మంది వెళ్తే ఇబ్బందికరం. రాజకీయంగా బురద చల్లాలని చూడటం దారుణం. విజయవాడలో ఓ ఆలయంలో జరిగిన ఘటనపై విచారణ జరుగుతోంది. రాజమండ్రి ఘటనపై కూడా సీఐడీ విచారణకి ఆదేశించాం. టీడీపీ వర్గానికి చెందిన ఆలయాల్లోనే దాడులు జరుగుతున్నాయి. టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న ఆలయాల్లో సీసీ కెమెరాలు పెట్టలేదు. రాష్ట్రంలో ఆలయాలపై దాడుల కేసులో 169 మందిని అరెస్ట్ చేశాం. రాష్ట్రంలో 57,584 ఆలయాలు ఉన్నట్టు పోలీస్‌శాఖ మ్యాపింగ్ చేసింది. అంతర్వేది ఘటనకు ముందు 3వేల ఆలయాల్లోనే సీసీ కెమెరాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 39,076 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. దేవాలయాల నిధులను ఎక్కడా డైవర్ట్ చేయలేదు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వందలు, వేలల్లో దాడులు జరిగాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బాబు హయాంలో ధ్వంసం చేసిన ఆలయాలను పునర్నిర్మిస్తాం. తిరుపతి ఉపఎన్నికలో లబ్ధి కోసం బాబు కుట్రలు చేస్తున్నారని’’ మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు. -
‘రామతీర్థం’ చైర్మన్ పదవి నుంచి గజపతిరాజు తొలగింపు
సాక్షి, విజయవాడ: రామతీర్థం దేవస్థానం ఛైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ నిర్వహణలో వైఫల్యం చెందిన నేపథ్యంలో పదవి నుంచి తొలగిస్తూ దేవాదాయశాఖ కార్యదర్శి గిరిజాశంకర్ మెమో జారీ చేశారు. రామతీర్ధం సహా 3 ఆలయాల ఛైర్మన్ల పదవి నుంచి ఉద్వాసన పలికింది. పైడితల్లి, తూర్పుగోదావరి జిల్లా మందపల్లి దేవస్థానాల ఛైర్మన్ పదవుల నుంచి తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. (చదవండి: పప్పునాయుడు సవాల్‌కు మేం రెడీ..) కాగా, రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలో డిసెంబర్ 28వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు శ్రీరాముని విగ్రహం శిరస్సు తొలగించి, సీతమ్మవారి కొలనులో పడేసిన సంగతి తెలిసిందే.. ఈ సంఘటనపై ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయం పలు అనుమానాలకు తావిస్తోంది. (చదవండి: అయ్యో... రామ‘చంద్ర’!) -
విజయనగరంలో భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు
సాక్షి, విజయనగరం: మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి పర్వదినం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని నెల్లిమర్ల మండలం రామతీర్ధాలు పుణ్యక్షేత్రంలో నేటి నుంచి రెండు రోజుల పాటు శివరాత్రి మహాజాతర ఉండటంతో ఈరోజు తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుణ్యక్షేత్రానికి ఇరుత జిల్లాల నుంచి వేలాదిగా తరలిస్తున్న భక్తులు. ఎస్. కోట: మహాశివరాత్రి సందర్భంగా ఎస్. కోట మండలం పుణ్యగిరి ఉమాకోటిలింగేశ్వరస్వామి దేవస్థానంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా వేలాదిగా తరలి వస్తున్న భక్తులు. జిల్లా కేంద్రంలో శివాలయం వీధిలో భక్తులుతో నిండిన శివాలయాలు. ఎస్ కోట నుంచి పుణ్యగిరి కొండవరకు ఇరవై నాలుగు గంటలు పాటు నిరంతరాయంగా పది బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా నాలుగు వందల మంది పోలీసులుతో బందోబస్తు నిర్వహించారు. -
అంతా ఆర్భాటమే..
రామతీర్థం దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామన్న మంత్రి మాణిక్యాలరావు హామీ నిలుపుకోని సర్కార్ నాలుగు నెలలైనా విడుదల కాని నిధులు ప్రతిపాదనలకే పరిమితమైన అభివృద్ధి పనులు రామతీర్ధం(నెల్లిమర్ల) : రాష్ట్రంలోనే అతిపెద్ద సీతారాముల ఆలయమైన రామతీర్థాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం. దేవస్థానంలో ప్రతి ఏటా అధికారికంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తాం. అంతేగాకుండా ఆలయంలో అభివృద్ధి పనులకు తక్షణమే రూ 1.70 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఇదీ ఈ ఏడాది మార్చిలో రామతీర్థం దేవస్థానానికి విచ్చేసిన రాష్ట్ర దేవాదాయశాఖా మంత్రి మాణిక్యాలరావు స్వయంగా ఇచ్చిన హామీ. అయితే నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి నాలుగు నెలలైనా ఇప్పటివరకు ఆ ఊసే లేదు. దీంతో దేవస్థానంలో అభివృద్ధి పనులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. వివరాల్లోకి వెలితే.. రాష్ట్ర విభజన తర్వాత ఈ ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా ఎక్కడ నిర్వహించాలనే విషయమై కడప జిల్లాలోని అతి ప్రాచీనమైన ఒంటిమిట్ట, జిల్లాలోనే అతి పెద్దదైన రామతీర్థం దేవస్థానాల మధ్య అప్పట్లో పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే చివరకు ఒంటిమిట్టలోనే ఉత్సవాలు నిర్వహించేందుకు ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అప్పట్లో ఉత్తరాంధ్రకు చెందిన భక్తులు, సాధువులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. దీంతో దిగొచ్చిన టీడీపీ ప్రభుత్వం కడపలోని ఒంటిమిట్టతో పాటు రామతీర్థంలోనూ ప్రభుత్వ లాంఛనాలతో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా అదే నెలలో జరిగిన ఉత్సవాలకు ప్రభుత్వం తరుపున దేవాదాయశాఖా మంత్రి మాణిక్యాలరావు హాజరయ్యారు. ఆ సమయంలో దేవస్థానం అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ 1.70 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పనులకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతేగాకుండా అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఒంటిమిట్టతో సమానంగా రామతీర్థం దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని అప్పట్లో హామీలు గుప్పించారు. ఆయన హామీ మేరకు ఆలయంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఏప్రిల్‌లో దేవస్థానం అధికారులు ప్రతిపాదనలు సైతం పంపించారు. ఆలయ ప్రధాన ద్వారంతో పాటు దక్షిణ గోపుర నిర్మాణం, తదితర పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే మంత్రి హామీలిచ్చి నాలుగు నెలైనా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ఆ సమయంలో భక్తులను శాంతింపజేయాలనే ఉద్ధేశంతోనే మంత్రి అలా ప్రకటించారని పలువురు విమర్శిస్తున్నారు. ఓ వైపు ఒంటిమిట్టలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతుంటే ఆ ఆలయంతో సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పిన రామతీర్థాన్ని మాత్రం పట్టించుకోకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సర్కార్ స్పందించి రామతీర్థంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.