ఏపీకి హోదా లేదు | No special status for Andhra Pradesh : Centre | Sakshi
Sakshi News home page

ఏపీకి హోదా లేదు

Published Wed, Apr 12 2017 2:40 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ఏపీకి హోదా లేదు - Sakshi

ఏపీకి హోదా లేదు

తేల్చిచెప్పిన కేంద్రం.. ఇచ్చి తీరాల్సిందేనన్న వైఎస్సార్‌సీపీ
హోదాపై అట్టుడికిన రాజ్యసభ.. ఎన్‌డీసీ అనుమతి లేదన్న మంత్రి
హోదాను సమర్థించిన తెలంగాణ ఎంపీలు.. టీడీపీ ఎంపీల గైర్హాజరు
నోరుమెదపని టీడీపీ మంత్రి అశోక్‌గజపతిరాజు
కేంద్ర వైఖరికి నిరసనగా ప్రతిపక్షాల వాకౌట్‌


సాక్షి, న్యూఢిల్లీ:
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీతో సహా మరే రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇచ్చే ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో కేంద్ర ప్రణా ళికాశాఖ సహాయమంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ ఈ విషయం చెప్పడంతో అలజడి చెల రేగింది. కేంద్ర తీరును నిరసిస్తూ వైఎస్సార్‌ సీపీ, కాంగ్రెస్, వామపక్షాలు సహా ప్రతిపక్ష సభ్యులంతా వాకౌట్‌ చేశారు.

హోదాపై కీలక చర్చ జరుగుతున్నప్పుడు టీడీపీ సభ్యులంతా గైర్హాజరయ్యారు. తెలంగాణ ఎంపీలైన కేశవ రావు, రాపోలు ఆనందభాస్కర్‌ కూడా ఏపీకి హోదా ఇవ్వాలని సమర్థిస్తూ మాట్లాడగా సభ లో ఉన్న తెలుగుదేశం మంత్రి అశోక్‌ గజపతి రాజు మాత్రం మౌన ప్రేక్షకుని మాదిరిగా కూర్చున్నారు. ఏపీకి కచ్చితంగా హోదా ఇవ్వా ల్సిందేనని వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయ సాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. హోదా కలిగిన రాష్ట్రాల కంటే ఏపీకి నిధులు తక్కువ అందా యని, ఏపీకి కేంద్రం న్యాయం చేయడంలేదని ఆయన ఆరోపించారు.

 కేంద్ర మంత్రిని ప్రతి పక్ష సభ్యులు ప్రత్యేకించి విజయసాయిరెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎంపీ కె.కేశవరావు, కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పలుసార్లు అడ్డు కున్నారు. ఒక దశలో  పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవదీస్తూ సభలో తీర్మానించిన విషయాలకు జాతీయ అభివృద్ధి మండలి ఆమోదం అవ సరమా అని కేకే నిలదీశారు. ఏపీకి హోదా ఇవ్వాలని కాంగ్రెస్‌ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌ కోరారు. హోదా కోసం ఏపీలో ఆందోళనలు సాగుతున్నాయని గుర్తు చేశారు.

ఎన్‌డీసీ అనుమతి లేదు: మంత్రి
చర్చ సందర్భంగా పలువురు సభ్యులు లేవ నెత్తిన అంశాలకు జవాబిస్తూ జాతీయ అభి వృద్ధి మండలి (ఎన్‌డీసీ) ఉన్న సమయంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారని మంత్రి ఇంద్రజిత్‌ సింగ్‌ చెప్పారు.  హోదా ఇవ్వాలంటే జాతీయ అభివృద్ధి మండలి అనుమతించాలని, ఏపీకి ఆ అనుమతి లేద న్నారు. ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా పరిగణిస్తున్నా మన్నారు. హోదా విషయంపై రాజ్యసభలో మాజీ ప్రధాని హామీ ఇచ్చిన విషయాన్ని తాను తిరస్కరించడం లేదన్నారు. హోదా లేని రాష్ట్రాలైన కేరళ, ఏపీలకు రెవెన్యూ లోటు నిధులను అందించాలని ఆర్ధిక సంఘం సిఫార్సు చేసిందని మంత్రి  చెప్పారు.

ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నిధులను ఏపీకి అందించామని ఇంద్రజిత్‌ సింగ్‌ చెప్పడంతో కాంగ్రెస్‌ ఎంపీ దిగ్విజయ్‌ సింగ్‌ గట్టిగా అడ్డుకున్నారు. మంత్రి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. యూపీఏ ఇచ్చిన రాయితీలను మోదీ ప్రభుత్వం ఉపసంహరిస్తోందని మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్‌ వ్యాఖ్యానించారు. మంత్రి జవాబు సంతృప్తికరంగా లేదని విపక్ష సభ్యులు వాకౌట్‌ చేశారు.  

గతంలో ఇచ్చిన రాష్ట్రాలకు కొనసాగడం లేదా?
11 రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చిందని గుర్తు చేస్తూ రాష్ట్ర విభజన సంద ర్భంగా బీజేపీ నేతలు వెంకయ్య నాయుడు, అరుణ్‌ జైట్లీ డిమాండ్‌ చేయడం వల్లే అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హామీ ఇచ్చారని సీపీఐ ఎంపీ డి.రాజా చెప్పారు. గతంలో రాష్ట్రాలకు ఇచ్చిన హోదా కొనసాగుతుందా లేదా అని రాజా ప్రశ్నించారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిని జీఎస్టీ బిల్లును, ఆధార్‌ను మోదీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లిందని అయితే ఏపీకి హోదా అంశాన్ని మోదీ ప్రభుత్వం ఎందుకు ముందుకు తీసు కెళ్లడం లేదని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేశ్‌ ప్రశ్నించారు.

ఏపీకి హోదా ఇవ్వకుండా వేరే కారణాలు చూపిం చడం సరికాదని కాంగ్రెస్‌ ఎంపీ టి.సుబ్బ రామి రెడ్డి చెప్పారు. హోదా వల్ల పలు ప్రయో జనాలున్నాయని, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి ఎన్ని కల సభలో హామీ ఇచ్చిన నరేంద్ర మోదీ ఇపుడు మాట ఎందుకు తప్పుతున్నారని కాంగ్రెస్‌ ఎంపీ దిగ్విజయ్‌ సింగ్‌ ప్రశ్నించారు.  యూపీఏ హయాంలో పలు  రాష్ట్రాలకు హోదా కల్పించారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వవద్దని 14 వ ఆర్ధిక సంఘం సిఫార్సు చేయ లేదని టిఆర్‌ఎస్‌ ఎంపీ కె.కేశవరావు స్పష్టం చేశారు.

ఏపీని ప్రత్యే కంగా పరిగణించాలని, కేవలం నిధులతో విషయాన్ని పక్కకు పెట్టడం సరికాదని కేశవరావు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా 14 వ ఆర్ధిక సంఘం సిఫార్సులను కారణంగా కేంద్రం పేర్కొంటోందని కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై సావధాన తీర్మానాన్ని ప్రవేశపెడుతూ.. ఎన్డీయే ప్రభుత్వం 2014 మే లో ఏర్పాటైందని, 2014 డిసెంబర్‌లో ఆర్ధిక సంఘం సిఫార్సులు అందించిందని, ఆ మధ్య కాలంలో మాజీ ప్రదాని మన్మోహన్‌ సింగ్‌ ఇచ్చిన హామీని అమలు చేసి ఉండవచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు. ఏపీని రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రంగా 14 వ ఆర్ధిక సంఘం గుర్తించిందని, అందువల్ల జాతీయ అభివృద్ధి మండలిని వెంటనే సమావేశపర్చాలని కేవీపీ డిమాండ్‌ చేశారు. రాజ్యసభలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఏపీకి ప్రత్యేక హోదా ఎప్పుడు కల్పిస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

ఎన్డీయే మోసం బయటపడింది: కేవీపీ
ఏపీ ప్రజలకు బీజేపీ, టీడీపీ.. మొత్తంగా ఎన్డీయే కూటమి చేస్తున్న మోసం రాజ్యసభ సాక్షిగా బయటపడిందని కేవీపీ చెప్పారు. రాజ్యసభలో చర్చ ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ హోదా విష యంలో అబద్ధాలతో కేంద్రం ప్రజలను మోసం చేస్తోందన్నారు.  హోదా ఇవ్వవద్దని 14వ ఆర్థికS సంఘం ఎక్కడా చెప్పలేదని, ఆర్ధిక సంఘం సభ్యులు అభిజిత్‌సేన్‌ ఈ విషయం స్పష్టం చేశారన్నారు. టీడీపీ ఎంపీలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తు న్నారని, ఈ రోజు చర్చలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు పాల్గొన లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని, గత ప్రభుత్వంలో ప్రధాని ఇచ్చిన హామీని గౌరవించుకోలేని, పార్లమెంట్‌ చట్టాలను రక్షించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: విజయసాయిరెడ్డి
ఏపీకి కచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. హోదా కలిగిన రాష్ట్రాల కంటే ఏపీకి నిధులు తక్కు వ అందాయని, ఏపీకి కేంద్రం న్యాయం చేయడంలేదని విజయసాయిరెడ్డి ఆరోపిం చారు. 14 వ ఆర్ధిక సంçఘం హోదా ఉన్న రాష్ట్రాలకు, లేని రాష్ట్రాలకు మధ్య రెవెన్యూ లోటు విషయంలో నిధులు అందించేందుకు వివక్ష ప్రదర్శించలేదని విజయసాయి రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇస్తామని సభ సాక్షిగా ఆనాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రత్యేక హోదా పొందుతున్న రాష్ట్రాల కంటే ఏపీ వెనుకబడి ఉందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందిన సాయం చాలా తక్కువని తెలిపారు. రాజ్యసభలో ఫ్యాక్టరీస్‌ (సవరణ)బిల్లు, 2016 పై జరిగిన చర్చలో పాల్గొంటూ ఏపీ లో పారిశ్రామిక ట్రిబ్యునల్‌ అండ్‌ లేబర్‌ కోర్టును ఏర్పాటు చేయాలని విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement