
సాక్షి, న్యూఢిల్లీ: ఇద్దరు కేంద్ర మంత్రుల రాజీనామాలకు ఆమోదముద్ర పడింది. కేంద్ర మంత్రి పదవులకు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి చేసిన రాజీనామాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం ఆమోదం తెలిపారు. ప్రధానమంత్రి సిఫారసు మేరకు వీరి రాజీనామాలను ఆమోదం లభించిందని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. పౌర విమానయాన శాఖను ప్రధాని పర్యవేక్షిస్తారని వెల్లడించింది. సుజనా చౌదరి నిర్వహించిన శాస్త్ర, సాంకేతిక సహాయ శాఖను ఎవరికీ అప్పగించలేదు. గురువారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వీరిద్దరూ రాజీనామాలు అందజేసిన సంగతి తెలిసిందే.
ఇన్నాళ్లుగా టీడీపీ ఎంపీల నిరసనలకు దూరంగా ఉన్న అశోక్‌గజపతిరాజు ఈరోజు పార్లమెంట్ వద్ద ఆందోళనలో పాల్గొన్నారు. సహచర ఎంపీలతో కలిసి నినాదాలు చేశారు.