సుజనా చౌదరి
న్యూఢిల్లీ: రాత్రికి రాత్రే పనులన్నీ పూర్తి చేయడానికి ఇదేమీ పీసీ సర్కార్ మ్యాజిక్ కాదు అని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. ఆలస్యమైనప్పటికీ ఏపీకి ప్రత్యేక రాయితీలు ఇచ్చేదిశగా పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాయితీలపై 99 శాతం పని పూర్తిఅయినట్లు తెలిపారు. మరో రెండు, మూడు సమావేశాల తరువాత ఒక స్పష్టత వస్తుందని సుజనా చౌదరి చెప్పారు.
సమావేశంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా, రాయితీ అంశాలను కేంద్రం పరిశీలిస్తుందని చెప్పారు. ఈ ఇద్దరు మంత్రులతోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా చర్చలలో పాల్గొన్నారు.
**