ఆర్‌ఆర్‌సీ– ఎన్‌సీఆర్‌లో భారీగా అప్రెంటిస్‌ ఖాళీలు | RRC, AAI, UCIL Recruitment 2021: Apply Online For Apprentice Vacancies | Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌సీ– ఎన్‌సీఆర్‌లో భారీగా అప్రెంటిస్‌ ఖాళీలు

Published Tue, Oct 19 2021 4:23 PM | Last Updated on Tue, Oct 19 2021 4:29 PM

RRC, AAI, UCIL Recruitment 2021: Apply Online For Apprentice Vacancies - Sakshi

ప్రయాగ్‌రాజ్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ).. నార్త్‌ సెంట్రల్‌ రైల్వే(ఎన్‌సీఆర్‌)కు చెందిన వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం ఖాళీల సంఖ్య: 1664

► ట్రేడులు: ఫిట్టర్,వెల్డర్,మెషినిస్ట్, కార్పెంటర్,ఎలక్ట్రీషియన్,పెయింటర్,మెకానిక్‌ తదితరాలు.

► అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి.

► వయసు: 01.12.2021 నాటికి 15–24 ఏళ్ల మధ్య ఉండాలి.

► ఎంపిక విధానం:పదో తరగతి,ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 02.11.2021

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:01.12.2021

► వెబ్‌సైట్‌: www.rrcpryi.org


ఏఏఐలో 90 అప్రెంటిస్‌లు

న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం ఖాళీల సంఖ్య: 90

► ఖాళీల వివరాలు: ట్రేడ్‌ అప్రెంటిస్‌–24, డిప్లొమా అప్రెంటిస్‌–36, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌–30.

► విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ సైన్స్, ఎయిరోనాటిక్స్, ఆర్కిటెక్ట్‌.

► అర్హత: సంబంధిత ట్రేడులు/విభాగాల్లో ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా, ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. » వయసు: 30.09.2021 నాటికి 26ఏళ్లు మించకుండా ఉండాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► ఎంపిక  విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, ఇంటర్వ్యూ /సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.10.2021

► వెబ్‌సైట్‌: https://www.aai.aero


యూసీఐఎల్, జార్ఖండ్‌లో 242 అప్రెంటిస్‌లు

జార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(యూసీఐఎల్‌).. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం ఖాళీల సంఖ్య: 242(జాదుగూడ యూనిట్‌–108, నర్వాపహర్‌ యూనిట్‌ –54, తురామ్‌దిహ్‌ యూనిట్‌–80).

► ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, టర్నర్‌/మెషినిస్ట్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, మెకానిక్‌ డీజిల్‌ తదితరాలు.

► అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్‌సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి.

► వయసు: 29.10.2021 నాటికి 18–25ఏళ్ల మధ్య ఉండాలి.

► ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 29.10.2021

► వెబ్‌సైట్‌: www.uraniumcorp.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement