విమానాల్లో ఒక్క నెలలో కోటిమంది..! | 10 crore people flew within India in 2016 | Sakshi
Sakshi News home page

విమానాల్లో ఒక్క నెలలో కోటిమంది..!

Published Tue, Jan 17 2017 3:57 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM

విమానాల్లో ఒక్క నెలలో కోటిమంది..!

విమానాల్లో ఒక్క నెలలో కోటిమంది..!

న్యూఢిల్లీ: మునుపెన్నడూ లేనంతగా దేశం లోపల విమానంలో ప్రయాణించేవారి సంఖ్య అమాంతం పెరిగింది. గత ఏడాదిలో మొత్తం 10 కోట్ల మంది దేశీయంగా స్వదేశీ విమానాల్లో ప్రయాణించారు. అయితే, ఒక్క డిసెంబర్‌లో ప్రయాణించిన వారి సంఖ్య దాదాపు కోటి ఉన్నట్లు విమాన సంస్థలకు చెందిన అధికారులు తెలిపారు. గత ఏడాది(2015)లో ఇదే డిసెంబర్‌లో 77.1లక్షలమంది మాత్రమే ప్రయాణించారు. డిసెంబర్‌ 2016లో స్వదేశీ విమానంలో ప్రయాణించినవారు దాదాపు 95.5కోట్లు ఉన్నారని ‘డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా’ పేర్కొంది.

కిందటేడాదితో పోలిస్తే ఇది 23.2శాతం అధికం అని తెలిపారు. స్పైస్‌ జెట్‌ విమానాల్లో ఎక్కువగా ప్రయాణాలు చేసినట్లు తెలిసింది. పెద్ద నోట్లు రద్దయిన తర్వాత కూడా రూ.500, రూ.1000 నోట్లు ఉపయోగించవచ్చని కేంద్రం చెప్పిన నేపథ్యంలో కూడా విమాన సంస్థల ఆదాయం అమాంతం పెరిగినట్లు సమాచారం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement