
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ధులే జిల్లాలో ‘బాంబే ఫ్లయింగ్ క్లబ్’కు చెందిన ఓ శిక్షణ విమానం కరెంట్ తీగలకు తగిలి నేల కూలింది. ఈ సంఘటనలో ప్రధాన పైలట్ కెప్టెన్ జె పి శర్మా, శిక్షణతీసుకుంటున్న ఇద్దరు యువతులకు గాయలయ్యాయి. ధులే జిల్లా సాక్రీ తాలూకా దాతర్తీ గ్రామంలో శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బాంబే ప్లయింగ్ క్లబ్ ఆధ్వర్యం శిక్షణ కొనసాగుతుండగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కరెంట్ తీగలకు తగిలి నేలకూలింది.
తృటిలో తప్పిన పెను ప్రమాదం...
కెప్టెన్ జెపి శర్మా సమయాస్ఫూర్తితో వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక లోపాలు ఏర్పడ్డాయని తెలుసుకున్న కెప్టెన్ వెంటనే దాతర్తీ గ్రామం నుంచి దూరంగా పొలాలవైపు విమానాన్ని మళ్లించారు. గ్రామంలో నివాసప్రాంతాల్లో విమానం కూలినట్టయితే తీవ్రంగా ప్రాణహానీ జరిగి ఉండేది. అయితే కెప్టెన్ సమయాస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
Comments
Please login to add a commentAdd a comment