
భువనేశ్వర్: శిక్షణ విమానం కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఒడిశాలోని ధెన్కనల్ జిల్లాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మృతుల్ని ట్రైనీ పైలట్, అతని శిక్షకుడిగా గుర్తించారు. బిరసాలలోని ప్రభుత్వ ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్‌స్టిట్యూట్ (గతి)లో ఈ ప్రమాదం చోటుచేసుకుందని జిల్లా అదనపు మెజిస్ట్రేట్ బీకే నాయక్ తెలిపారు. సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఘటనపై విచారణ చేపట్టామని వెల్లడించారు.
(చదవండి: పరీక్షల కోసం ప్రాణాలు రిస్కులో పెట్టలేం!)
Comments
Please login to add a commentAdd a comment