
కీసర: ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన శిక్షణ విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలిన సంఘటన గురు వారం మేడ్చల్ జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. హకీంపేట లోని రక్షణశాఖ వైమా నిక శిక్షణ కేంద్రం నుంచి కిరణ్ ఎంకే–2 శిక్షణ విమానం మధ్యాహ్నం 12 గంటల సమయం లో బయలుదేరింది. అయితే కొద్ది సేపటికే ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. పైలట్ అమన్‌పాండే ఆ విషయాన్ని గుర్తించి వెంటనే పారాచూట్ సాయంతో కిందకు దూకేశారు. అనంతరం కొద్ది సెకన్లలోనే ఆ విమానం శ్రీ లక్ష్మీ క్రషర్ మిషన్ సమీపంలో కుప్పకూలిపోయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందు కున్న వెంట నే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు.
అప్పటికే విమానం చాలావరకు దగ్ధమైంది. మరోవైపు విమానం ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న హకీంపేట వైమానిక శిక్షణ కేంద్రం అధికారులు హుటాహుటిన 2 హెలికాప్టర్లలో అక్కడకు చేరుకున్నారు. ప్రమా దంలో స్వల్పగాయాలతో బయట పడ్డ పైలట్ ను ప్రత్యేక విమానంలో ఆస్పత్రికి తరలించా రు. కీసర ఆర్డీఓ హనుమంతరెడ్డి, తహసీల్దార్ ఉపేందర్‌రెడ్డి కూడా సంఘటనా స్థలాన్ని సంద ర్శించి వివరాలను మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ. రెడ్డికి తెలియజేశారు. విమానం కుప్పకూలిన ప్రదే శానికి సమీపంలోనే క్రషర్ మిషన్ కార్మికుల ఆవాసాలున్నాయి. కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని క్రషర్ యజమాని వెల్లడించారు.