బీజింగ్: చైనాలో ఓ తేలికపాటి విమానం కూలిపోయి ఒక అమెరికన్ పైలట్, మరో చైనీయుడు ప్రాణాలు కోల్పోయారు. విమానం బయలు దేరిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక మీడియా సమాచారం మేరకు.. ఆదివారం మధ్యాహ్నం బయలుదేరిన విమానం కొద్ది సేపటికే కనిపించకుండా పోయింది. అనంతరం మంటల్లో కనిపించింది. తూర్పు చైనాలోని అనూయి అనే ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇది హెనాన్ ప్రావిన్స్లో పనిచేస్తున్న జార్జ్ హెయింట్జ్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ సంస్థకు చెందినది.