T20 World Cup 2024: మెల్‌బోర్న్‌ ఐకానిక్‌ సిక్స్‌ను రిపీట్‌ చేసిన విరాట్‌ Virat Kohli recreated the famous MCG six against Afghanistan pacer Naveen-ul-Haq in a Super 8 match. Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: మెల్‌బోర్న్‌ ఐకానిక్‌ సిక్స్‌ను రిపీట్‌ చేసిన విరాట్‌

Published Thu, Jun 20 2024 9:24 PM | Last Updated on Fri, Jun 21 2024 2:04 PM

T20 World Cup 2024 IND VS AFG: Virat Kohli Hit Straight Six On Naveen Ul Haq

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (జూన్‌ 20) జరుగుతున్న సూపర్‌-8 మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 14 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (8), విరాట్‌ కోహ్లి (24), రిషబ్‌ పంత్‌ (20), శివమ్‌ దూబే (10) ఔట్‌ కాగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ (34), హార్దిక్‌ పాండ్యా (11) క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘన్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ 3 వికెట్లు పడగొట్టగా.. ఫజల్‌ హక్‌ ఫారూఖీ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

ఐకానిక్‌ సిక్స్‌ను రిపీట్‌ చేసిన విరాట్‌
ఈ మ్యాచ్‌లో విరాట్‌ 2022 టీ20 వరల్డ్‌కప్‌లో మెల్‌బోర్న్‌ మైదానంలో పాక్‌ పేసర్‌ హరీస్‌ రౌఫ్‌ బౌలింగ్‌లో బాదిన ఐకానిక్‌ సిక్స్‌ను రిపీట్‌ చేశాడు. నవీన్‌ ఉల్‌ హక్‌ బౌలింగ్‌లో విరాట్‌ కొట్టిన సిక్సర్‌ మెల్‌బోర్న్‌ ఐకానిక్‌ సిక్సర్‌ను గుర్తు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో మాంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన విరాట్‌.. 24 బంతుల్లో సిక్సర్‌ సాయంతో 24 పరుగులు చేసి రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో మొహమ్మద్‌ నబీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement