మేకప్‌ లేకుండా.. మిస్‌ ఇంగ్లాండ్‌ అందాల పోటీలోకి.. చరిత్రలో తొలిసారి | 20 Year Old Miss England Contestant Makes History As Competes Without Makeup | Sakshi
Sakshi News home page

మేకప్‌ లేకుండా.. మిస్‌ ఇంగ్లాండ్‌ అందాల పోటీలోకి.. చరిత్రలో తొలిసారి

Published Mon, Aug 29 2022 12:41 PM | Last Updated on Mon, Aug 29 2022 12:48 PM

20 Year Old Miss England Contestant Makes History As Competes Without Makeup - Sakshi

మామూలుగానే ఆడవాళ్లు అలంకారాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు.. ఇక అందాల పోటీలో పాల్గొనే అతివలైతే మేకప్‌పై మరింత దృష్టి పెడుతుంటారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఏ బ్యూటీ కాంటెస్ట్‌లో అయినా అందానికి మెరుగులు దిద్దుకున్న భామలే కనిపిస్తుంటారు. కానీ లండన్‌కు చెందిన 20 ఏళ్ల మెలీసా రవూఫ్‌ దశాబ్దాలుగా సాగుతున్న ఈ తంతుకు బ్రేక్‌ వేసింది.

మిస్‌ ఇంగ్లాండ్‌ అందాల పోటీలో ఎటువంటి మేకప్‌ లేకుండా పాల్గొన్న తొలి మహిళగా నిలవడం ద్వారా 94 ఏళ్ల ఈ పోటీ చరిత్రను తిరగరాసింది. తాజాగా ఈ పోటీల ఫైనల్స్‌ వరకు దూసుకెళ్లింది. వాస్తవానికి 2019లో జరిగిన మిస్‌ ఇంగ్లాండ్‌ పోటీలో మేకప్‌ లేకుండా కంటెస్టెంట్లు పాల్గొనే ఒక రౌండ్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేసినప్పటికీ పోటీ ఆసాంతం ఓ యువతి ఇలా మేకప్‌ లేకుండా పాల్గొనడం ఇదే తొలిసారి.

అతివలు అంతఃసౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని చాటిచెప్పేందుకు.. అడ్వర్టైజర్లు చెప్పే అందం నిర్వచనాలు, కొలమానాలు, ప్రమాణాలను సవాల్‌ చేసేందుకే మేకప్‌ లేకుండా ఈ పోటీలో పాల్గొంటున్నట్లు మెలీసా తెలిపింది. ఈ చర్యకుగాను మెలీసాను ప్రపంచవ్యాప్తంగా ప్రశంసిస్తోంది. మిస్‌ ఇంగ్లాండ్‌ కిరీటం కోసం అక్టోబర్‌ 17న జరిగే ఫైనల్స్‌లో మరో 40 మందితో మెలీసా పోటీపడనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement