beauty pageant
-
70 దేశాలను ఓడించి అందాల రాణిగా రాచెల్ గుప్తా : తొలి ఇండియన్‌గా చరిత్ర
-
Mia Le Roux: ఈ అందం వినిపిస్తోందా?
‘సమాజం ఎడంగా ఉంచే దివ్యాంగులకు ఇదెంత ముఖ్యమైన గెలుపో నాకు తెలుసు. అనూహ్యమైన కలలు కని వాటిని సాధించవచ్చని ఇవాళ నేను నిరూపించాను. దివ్యాంగుల పట్ల ఈ భూగ్రహంలో ఉన్న ఆంక్షల సరిహద్దులను నేను బద్దలు కొట్టాను’ అని హర్షధ్వానాల మధ్య అంది మియా లే రూ. 28 ఏళ్ల బధిర వనిత మియా లే 66 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాఫ్రికా అందాల పోటీలో కిరీటం ధరించిన తొలి బధిర మహిళగా చరిత్ర సృష్టించింది. ఆమె ఈ పోటీలో గెలిచినందుకుగాను సంవత్సరం పాటు నివసించడానికి ఒక ఖరీదైన ఫ్లాటు, లగ్జరీ బెంజి కారు, సుమారు 50 లక్షల రూపాయల నగదు, ఇంకా అనేక బహుమతులు దక్కాయి. శనివారం (ఆగస్టు 10) రాత్రి దక్షిణాఫ్రికాలోని పాలనా రాజధాని ప్రిటోరియాలో జరిగిన ఫైనల్స్‌లో ఈ ఘనత సాధించింది.పుట్టుకతో చెవుడుఫ్రెంచ్ మూలాలున్న మియా లే కుటుంబం తరాల ముందు వచ్చి సౌత్ ఆఫ్రికాలో స్థిరపడింది. మియా పుట్టాక సంవత్సరం తర్వాత ఆమెకు పూర్తిచెవుడు ఉన్నట్టు గ్రహించారు తల్లిదండ్రులు. కొన్నేళ్ల తర్వాత కాక్లియర్ ఇంప్లాంట్స్ వేసి రెండు సంవత్సరాల పాటు స్పీచ్‌థెరపీ ఇస్తే తప్ప ఆమె మొదటి మాట మాట్లాడలేదు. ఆ తర్వాత కూడా ఆమె మాట స్పష్టం కాలేదు. ఆమెకు ఇప్పటికీ వినపడదు. ‘నా కాక్లియర్ ఇంప్లాంట్స్‌ను ఆధునిక సాఫ్ట్వేర్ ద్వారా అనుసంధానం చేసుకున్నాను. అందువల్ల పెదవుల కదలికను బట్టి కొద్దిగా వినపడే ధ్వనిని బట్టి ఎదుటివారి మాటలు అర్థం చేసుకుంటాను. గుంపులో ఉండి నాతో మాట్లాడితే నాకు ఏమీ అర్థం కాదు. అందరి శబ్దాలు కలిసి నాకు స్పష్టత ఉండదు’ అంటుంది మియా లే. మోడల్‌గా, మార్కెటింగ్ రంగ నిపుణురాలిగా పని చేస్తున్న ఈమె అందాలపోటీలో విజేతగా నిలవాలని కలగని, సాధించింది.నల్లరంగు–తెల్లరంగుసౌత్ ఆఫ్రికా అందాల కిరీటం కోసం నల్ల అందగత్తె చిడిమ్మ అడెస్ట్షినా పోటీ పడింది. ఆమెకు సౌత్ ఆఫ్రికాలో గొప్ప ఫాలోయింగ్ ఉంది. అయితే ఆమె పౌరసత్వం మీద వివాదం నెలకొంది. ఆమె నైజీరియా తండ్రికీ, మొజాంబిక్ తల్లికీ జన్మించిందని ట్రోల్స్ మొదలయ్యాయి. దాంతో విజయం అంచు వరకూ చేరిన చిడిమ్మ పోటీ నుంచి తప్పుకుంది. దాంతో మియా గెలుపు సులవు అయ్యింది. రంగును బట్టి మియా గురించి ఒకటి రెండు విమర్శలు వచ్చినా పోటీ నుంచి తప్పుకున్న చిడిమ్మ మనస్ఫూర్తిగా ఆమెను అభినందించింది. ‘నువ్వు మా అందరి కలలకు ప్రతినిధిగా నిలిచావు’ అని పోటీలో గెలిచిన మియాను చిడిమ్మ కొనియాడింది.నేనొక వారధిని‘దివ్యాంగులు సమాజంలో భాగం కావాలంటే ప్రభుత్వాలు పూనుకోవాలి. నాకొచ్చిన ఈ అందాల కిరీటంతో నేను దివ్యాంగులకు ప్రభుత్వానికి ఒక వారధి కాదలిచాను. చిన్నవయసు నుంచి దివ్యాంగులు అసాధ్యమైన కలలు గనే స్థయిర్యాన్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను’ అంది మియా లే రూ. -
ఏఐ కాంప్లెక్స్‌లో అందాల పోటీలు
‘కల్కి’ సినిమాలో ‘కాంప్లెక్స్’ ఉన్నట్టే ఏ.ఐకి కూడా ఒక ప్రపంచం ఉంది. అందులో ఏ.ఐ ద్వారా తయారైన అందగత్తెలు ఉన్నారు. సరే. అన్ని దేశాల ఏ.ఐ.అందగత్తెలకు పోటీ పెడితే? పెట్టారు. మొరాకో ఏ.ఐ. అందగత్తె కెంజా లైలీ ‘మిస్ ఏ.ఐ’గా కిరీటం సాధించి చరిత్ర సృష్టించింది. ఇదొక నిజంలాంటి కల్పన. అందమైన డిజిటల్ సృష్టి.సోషల్ సబ్స్క్రిప్షన్ ప్లాట్‌ఫామ్ ‘ఫ్యాన్ వ్యూ’ నిర్వహించిన ‘మిస్ ఏఐ’ అందాల పోటీలో రియలిజమ్, టెక్, సోషల్ క్లౌట్ అనే మూడు ముఖ్యమైన విభాగాలు ఉన్నాయి. ఈ మూడు విభాగాల్లో మిగిలిన వారితో పోల్చితే కెంజా లైలీ ‘బెస్ట్’ అనిపించుకుంది. న్యాయనిర్ణేతలలో ఇద్దరు ఏఐ–జనరేటెడ్ ఇన్ఫ్లూయెన్సర్లు కూడా ఉన్నారు.‘యాక్టివిస్ట్ అండ్ ఇన్ఫ్లూయెన్సర్’గా గుర్తింపు తెచ్చుకున్న ఏ.ఐ. యువతి కెంజా లైలీకి ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు లక్షల వరకు ఫాలోవర్లు ఉన్నారు. కెంజా ఏడు భాషల్లో మాట్లాడగలదు. ఫ్యాషన్, ఆహారం, అందం, ట్రావెల్... మొదలైన వాటికి సంబంధించి కంటెంట్ జనరేట్ చేస్తుంది. ‘ఫినిక్స్ ఏఐ’ సీయివో మెరియమ్ బెసా ఈ యువతి సృష్టికర్త. ‘మిస్ ఏ.ఐ’ కిరీటం సాధించాక కెంజా లైలీ మాట్లాడుతూ– ‘కృత్రిమ మేధ సృష్టికర్తల తరపునప్రాతినిధ్యం వహించే, కృత్రిమ మేధస్సులోని సానుకూల కోణాన్ని ఆవిష్కరించే మంచి అవకాశం నాకు వచ్చింది. ఏఐ టెక్నాలజీ అభివృద్ధిలో మరింత క్రియాశీలంగా వ్యవహరించడానికి ఈ విజయం నాకు ఉపయోగపడుతుంది. మొరాకో, మధ్య్ర΄ాచ్యంలో మహిళా సాధికారతకు దోహదం చేయడం నా లక్ష్యం. కృత్రిమ మేధస్సుపై ఎన్నో అనుమానాలు, అపోహలు ఉన్నాయి. ఈ భయాలను తొలగించడంపై దృష్టి పెడతాను. కృత్రిమ మేధ అనేది ఒక సాధనం మాత్రమే కాదు... ఇంతకు ముందు ఎవరూ సృష్టించలేని అవకాశాలను సృష్టించగల పరివర్తన శక్తి. విద్యారంగంలో ఏఐ వల్ల జరిగిన మంచి పనులు చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఏఐ అనేది మానవ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేదే తప్ప దాన్ని భర్తీ చేయలేదు. మనుషులు, కృత్రిమ మేధ మధ్య సహకారాన్ని పెంపొందించడం నాప్రాధాన్యతలలో ముఖ్య మైనది’ అంటుంది కెంజా. ఈ పోటీలో రన్నర్స్–అప్‌గా ఫ్రాన్స్‌కు చెందిన లలీన, పోర్చుగల్‌కు చెందిన వోలివ సి నిలిచారు. భారత్ నుంచి శతావరిఏఐ అందాల పోటీలో మన దేశానికి చెందిన జరా శతావరి ‘టాప్–10’ ఫైనల్ లిస్ట్‌కు ఎంపికై ‘ఎవరీ శతావరి?’ అని చాలామంది ఆరా తీసేలా చేసింది. శతావరి ఫొటోలు సోషల్ మీడియాలో అందంగా సందడి చేశాయి. ఒక మొబైల్ కంపెనీ యాడ్ ఏజెన్సీకి కో–ఫౌండర్ అయిన రాహుల్ చౌదరి ‘శతావరి’ సృష్టికర్త. హార్మోన్ సమస్యల నుంచి కుంగుబాటు వరకు ఎన్నో అంశాలపై మహిళలకు అవగాహన కలిగిస్తోంది శతావరి. ఈ ‘డిజిటల్ దివా’ తన వెబ్సైట్లో హెల్త్ నుంచి లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ వరకు ఎన్నో అంశాలపై రచనలు చేస్తుంది. స్ట్రాటెజిక్ ప్లానింగ్, కంటెంట్ డెవలప్మెంట్, డేటా ఎనాలసిస్... మొదలైన ఏరియాలలో అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. -
వరల్డ్స్ ఫస్ట్ మిస్ ఏఐగా కిరీటాన్ని దక్కించుకున్న మొరాకో బ్యూటీ..! (ఫొటోలు)
-
మిస్ ఏఐ అందాల పోటీ టాప్‌లో జరా శతావరి! ఎవరీ బ్యూటీ..? (ఫోటోలు)
-
అందాల పోటీలు: మీరు ఎలా ఉన్నా పర్వాలేదు.. కాళ్లు బావుంటే చాలు
అందాలపోటీలు అనగానే అందమైన యువతులు స్టైల్‌గా ర్యాంప్‌వాక్ చేస్తున్న దృశ్యం మన కళ్లముందు కనిపిస్తుంది. 90వ దశకం నుంచి సౌందర్యపోటీలు వెలుగులోకి వచ్చాయి. బ్యూటీ విత్ ఏ పర్సన్ అన్నట్లు బాహ్య సౌందర్యమే కాదు, అంతః సౌందర్యం కూడా చాలా ప్రధానం. ఈ పోటీలు వివిధ దశల్లో జరుగుతుంటాయి. అయితే 1930 -53 కాలంలో చెప్పులతో అందాల పోటీలు జరిగేవి. వినడానికి విడ్డూరంగా ఉన్నా సౌందర్యం చూసో, ఫిజికల్ ఫిట్నెస్ చూసో కాకుండా కాళ్లను చూసి విజేతలుగా ప్రకటించేవారు. సౌందర్య పోటీల్లో వస్త్రధారణ, ర్యాంప్‌వాక్ వంటివి ప్రత్యేక ఆకర్షణ. అయితే 1900 ప్రారంభంలో మహిళల అందాల పోటీల్లో "ది ప్రెట్టీ యాంకిల్ కాంటెస్ట్" ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పోటీల్లో పాల్గొనే మహిళలు ముఖం చూపించకుండా తెర వెనుక నిల్చుంటారు. మోకాలి కింద వరకు డ్రెస్ చేసుకొని అందరూ ఒకే వరుసలో నిల్చుంటారు. ఈ పోటీల్లో ప్రధానంగా కాళ్లను బట్టి విజేత ఎవరో ప్రకటించేవారు. అల వైకుంఠపురములో సినిమాలో పూజాహెగ్డే కాళ్లను చూసి అల్లు అర్జున్ మెస్మరైజ్ అయినట్లు ఈ యాంకిల్ కాంటెస్ట్ పోటీల్లో అందమైన కాళ్లతో ఫిదా చేయాలన్నమాట. సాధారణంగా అందాల పోటీల్లో పాల్గొనేవారు అవివాహితులై ఉండాలి కానీ యాంకిల్ కాంటెస్ట్‌కి మాత్రం ఈ రూల్ అవసరం లేదు. ఎవరైనా ఈ పోటీల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే..ఈ పోటీలకు పోలీసులు లేదా క్లర్క్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు. When women were judged by the attractiveness of their ankles (1930-1953) "The pretty ankle contest" appeared in the early 1900s as special shows within women's beauty competitions. Contestants would have to stand behind a curtain to conceal their bodies, so that all that could… pic.twitter.com/RTsB1JkHQU — Historic Vids (@historyinmemes) July 5, 2023 -
అందాల పోటీల్లో భార్య ఓటమి.. కోపంతో భర్త ఏం చేశాడంటే..
బ్రెజిల్ దేశంలో జరిగిన ఓ అందాల పోటీల్లో తన భార్యని కాకుండా వేరే యువతిని విజేతగా ప్రకటించడంతో కోపోద్రిక్తుడైన ఆమె భర్త ఒక్క ఉదుటున డయాస్ మీదకు దూకి విజేతకు ధరింపజేసే అందాల కిరీటాన్ని లాక్కుని నేలకేసి బలంగా విసిరికొట్టాడు. అందాల భామ నెత్తిన వయ్యారంగా ఒదిగిపోవాల్సిన ఆ కిరీటం కాస్తా ముక్కలు ముక్కలైపోయింది. వివరాల్లోకి వెళ్తే... బ్రెజిల్లో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మిస్ గే మాటో గ్రోసో అందాల పోటీని ఈ ఏడాది కూడా నిర్వహించారు. చాలామంది అందగత్తెలు ఈ పోటీల్లో హొయలొలికించారు. రౌండ్ల వారీగా పోటీదారులను జల్లెడ పట్టగా, విజేతను ప్రకటించే సమయానికి పోటీలో చివరికి నథాలీ బెకర్, ఇమాన్యులీ బెలి అనే ఇద్దరు మాత్రమే మిగిలారు. ఈ క్రమంలో విజేతను ప్రకటించే సమయంలో వీరిద్దరిని ఎదురెదురుగా నిలబెట్టి మధ్యలో కిరీటాన్ని చేత్తో పట్టుకుని విజేతకు ధరింపజేసే క్రమంలో న్యాయ నిర్ణేత కొంత డ్రామా నడిపించింది. ఈ వ్యవధిలో తన భార్య నథాలీ బెకర్‌కు కాదని ఇమాన్యులీ బెలినిని విజేతగా ప్రకటించనున్నారని గ్రహించిన భర్త అమాంతం స్టేజి మీదకు దూకేశాడు. విజేతను ప్రకటించే లోపే న్యాయనిర్ణేత చేతుల్లో ఉన్న కిరీటాన్ని బలవంతంగా లాక్కుని నేలకేసి కొట్టాడు. అందరూ చూస్తుండగానే కోపంతో ఊగిపోయిన ఈ అతడు అక్కడితో ఆగకుండా తన భార్య చేయి పట్టుకుని అక్కడి నుండి తీసుకువెళ్లే సాహసం చేశాడు. ఇంకేముంది అక్కడే ఉన్న సెక్యూరిటీ వారు నథాలీ బెకర్ భర్తను పట్టుకుని దేహశుద్ధి చేసి విచారణ చేపట్టారు. నా భార్య ఓటమిని తట్టుకోలేకపోయా.. న్యాయనిర్ణేతలు నిర్ణయం సరైనది కాదని.. తన భార్యే ఈ పోటీల్లో గెలిచిందని, కానీ చివర్లో విజేతను తారుమారు చేస్తున్నారని అనిపించి ఆలా చేశానని నథాలీ బేకర్ భర్త వివరించాడు. అనంతరం ఈ పోటీల నిర్వాహకులు మాట్లాడుతూ.. అందాల పోటీ ముగింపు దశలో ఇలా జరగడం విచారకరమని, తమ నిర్ణయం సరైనదేనని చెప్పి ఇమాన్యులీ బెలినిని మిస్ గే బ్రెజిల్ 2023 విజేతగా ప్రకటించారు. Revolta na final do concurso Miss Brasil Gay 2023. Torcedor arranca coroa da vencedora e joga no chão durante a cerimônia de premiação. pic.twitter.com/rb6duFvAEn — Bruno Guzzo® (@brunoguzzo) May 28, 2023 -
వెక్కిరింతలు తట్టుకుని.. మూర్ఛ నుంచి మిస్ ఇండియా వరకు
From Epilepsy to Pageant Triumph- Strela Thounaojam: రెండు రోజుల క్రితం ‘మిస్ ఇండియా 2023’ ఫైనల్స్ జరిగాయి. రాజస్థాన్ సుందరి నందిని గుప్తా విజేత. ఢిల్లీకి చెందిన శ్రేయా పూజా ఫస్ట్ రన్నరప్. కాని మణిపూర్ అమ్మాయి స్టెర్లా లువాంగ్ సెకండ్ రన్నరప్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది. మణిపూర్ నుంచి మిస్ ఇండియా ఫైనల్స్ వరకూ చేరిన వారు ఇప్పటి దాకా లేరు. అదీగాక టీనేజ్‌లో మూర్ఛవ్యాధి వల్ల తీవ్రంగా బాధ పడిన స్టెర్లా తన అందాల కల కోసం ఆ వ్యాధితో పోరాడి గెలిచింది. స్ఫూర్తిగా నిలిచింది. టీనేజ్‌లో మూర్ఛ వ్యాధి ‘అది నా భవిష్యత్తుకు అడ్డంకి అనుకోలేదు. ఒక ఆశీర్వాదం అనుకున్నాను’ అంది టీనేజ్‌లో మూర్ఛ వ్యాధి బారిన పడ్డ స్టెర్లా. ‘అడ్డంకులు వస్తేనే కదా మనం పోరాడి మరింత శక్తిమంతులం అయ్యేది’ అందామె. అతి చిన్న రాష్ట్రం నుంచి మొదటిసారి ఇప్పుడు స్టెర్లా మణిపూర్‌లో క్షణం తీరిక లేకుండా జనం అభిమానంతో ఇస్తున్న విందుల్లో పాల్గొంటోంది. సీఎం ఆమెను ఆహ్వానించి ప్రభుత్వ పెద్దలతో కలిసి డిన్నర్ ఇచ్చాడు. కారణం మణిపూర్‌లాంటి అతి చిన్న రాష్ట్రం నుంచి మొదటిసారి ‘మిస్ ఇండియా’ పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో ఒకరుగా ఆమె నిలవడం. ఏప్రిల్ 15న ఇంఫాల్‌లో జరిగిన ‘మిస్ ఇండియా 2023’ ఫైనల్స్‌లో 28 రాష్ట్రాలు 2 కేంద్ర ప్రాంతాల నుంచి 30 మంది పోటీ పడితే వారితో తలపడి మూడో స్థానంలో నిలిచింది స్టెర్లా. అయితే ఈ విజయం అంత ఈజీగా రాలేదు. మానసికంగా ఆరోగ్యపరంగా ఆమె చాలా పోరాటం చేయాల్సి వచ్చింది. వెక్కిరింతలు తట్టుకుని 14 ఏళ్ల వయసులో స్టెర్లాకు మిస్ ఇండియా కావాలన్న లక్ష్యం ఏర్పడింది. కాని ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎవరూ అలాంటి కలను కనరు. ఇంకా చెప్పాలంటే ‘నిర్వచనాల ప్రకారం ఉండే ముక్కు, రూపు’ వారికి లేవన్న భావన వారిలో బలంగా ప్రవేశపెట్టి చాలా కాలం అవుతోంది. అందుకే అందరూ ఏడ్పించేవారు స్టెల్లాను. అది వొత్తిడిగా మారి ఆ తర్వాత నరాల జబ్బుగా పరిణమించింది. తరచూ మూర్ఛలు వచ్చేవి. ఒక్కోసారి మంచానికి అతుక్కు పోయేదాన్ని. అలాంటి స్థితిలో కూడా ఇదంతా దాటుతాను... నాకో అందమైన భవిష్యత్తు ఉంటుంది అని గట్టిగా అనుకునేదాన్ని. అదే నిజమైంది. ఇవాళ నా జబ్బును జయించాను. ఆత్మవిశ్వాసం పెంచుకున్నాను’ అంటుందామె. క్యాబిన్ క్రూగా పని చేసి బిజినెస్ స్టడీస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొనసాగిస్తూనే మోడల్‌గా పని చేస్తోంది స్టెల్లా. కొంతకాలం ఒక ఎయిర్ లైన్స్ సంస్థలో క్యాబిన్ క్రూగా చేసింది. ‘ఇంతకు ముందు అందం నిర్వచనం వేరే ఉండేది. ఇప్పుడు సహజ రూపాలను కూడా అందంగా చూస్తు్తన్నారు. అందుకే నేను టాప్ 3గా నిలిచానని అనుకుంటున్నాను.’ అంది స్టెర్లా. చదవండి: 1994లో తెల్లవెంట్రుకలను నల్లగా చేసే హెర్బల్ మందు కనిపెట్టాం! ఇప్పుడిలా.. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) -
అందాల పోటీల్లో కేశనపల్లి గిత్తకు ప్రథమ స్థానం
మలికిపురం: రాష్ట్ర స్థాయిలో జరిగిన అందాల పోటీలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి గ్రామం అడబాల లక్ష్మీనారాయణ (నాని)కి చెందిన పుంగనూరు గిత్త ప్రథమ స్థానం పొందింది. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా పెదతాడేపల్లిలో జరిగిన ఈ పోటీలలో ఈ గిత్తకు రూ.30 వేల బహుమతి లభించింది. మంత్రి కొట్టు సత్యనారాయణ, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోసేన్‌రాజు, ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు చేతుల మీదుగా లక్ష్మీనారాయణ బహుమతి అందుకున్నారు. దేశీయ గోజాతి సంవర్ధక అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. ఎత్తు 13 అంగుళాలు.. పొడవు 19 అంగుళాలు మలికిపురం మండలంలోని పడమటిపాలెం గ్రామంలో సోమవారం అరుదైన పుంగనూరు గిత్త దూడ జన్మించింది. పెద్దిరెడ్డి సత్యనారాయణ మూర్తికి చెందిన పుంగనూరు ఆవుకు ఈ దూడ జన్మించింది. దీని ఎత్తు 13 అంగుళాలు, పొడవు 19 అంగుళాలు ఉంది. పుంగనూరు దూడలన్నీ సాదారణంగా ఇదే సైజులో జన్మిస్తాయి. (క్లిక్ చేయండి: మండ పీతకు మంచి డిమాండ్.. 4 లక్షల ఆదాయం!) -
మేకప్ లేకుండా.. మిస్ ఇంగ్లాండ్ అందాల పోటీలోకి.. చరిత్రలో తొలిసారి
మామూలుగానే ఆడవాళ్లు అలంకారాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు.. ఇక అందాల పోటీలో పాల్గొనే అతివలైతే మేకప్‌పై మరింత దృష్టి పెడుతుంటారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఏ బ్యూటీ కాంటెస్ట్‌లో అయినా అందానికి మెరుగులు దిద్దుకున్న భామలే కనిపిస్తుంటారు. కానీ లండన్‌కు చెందిన 20 ఏళ్ల మెలీసా రవూఫ్ దశాబ్దాలుగా సాగుతున్న ఈ తంతుకు బ్రేక్ వేసింది. మిస్ ఇంగ్లాండ్ అందాల పోటీలో ఎటువంటి మేకప్ లేకుండా పాల్గొన్న తొలి మహిళగా నిలవడం ద్వారా 94 ఏళ్ల ఈ పోటీ చరిత్రను తిరగరాసింది. తాజాగా ఈ పోటీల ఫైనల్స్ వరకు దూసుకెళ్లింది. వాస్తవానికి 2019లో జరిగిన మిస్ ఇంగ్లాండ్ పోటీలో మేకప్ లేకుండా కంటెస్టెంట్లు పాల్గొనే ఒక రౌండ్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేసినప్పటికీ పోటీ ఆసాంతం ఓ యువతి ఇలా మేకప్ లేకుండా పాల్గొనడం ఇదే తొలిసారి. అతివలు అంతఃసౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని చాటిచెప్పేందుకు.. అడ్వర్టైజర్లు చెప్పే అందం నిర్వచనాలు, కొలమానాలు, ప్రమాణాలను సవాల్ చేసేందుకే మేకప్ లేకుండా ఈ పోటీలో పాల్గొంటున్నట్లు మెలీసా తెలిపింది. ఈ చర్యకుగాను మెలీసాను ప్రపంచవ్యాప్తంగా ప్రశంసిస్తోంది. మిస్ ఇంగ్లాండ్ కిరీటం కోసం అక్టోబర్ 17న జరిగే ఫైనల్స్‌లో మరో 40 మందితో మెలీసా పోటీపడనుంది. -
మిస్ వరల్డ్ 2021: అందాల రాశులు ఒక్కచోట చేరితే..
-
ముఖంపై కాలిన గుర్తులు.. అయినా ఆమె అందగత్తెనే!
Indian-American Shree Saini is first runner-up of Miss World 2021: జీవితంలో ‘చేదు’ను.. ‘తీపి’గా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. కష్టాలు, నష్టాలు, అవమానాలు ఎదురైనా.. ఓర్చుకుంటూ ముందుకు సాగడమే సిసలైన జీవిత ప్రయాణం. చిన్నవయసులోనే మోయలేనంతగా బాధల్ని చవిచూసింది ఆ చిన్నారి. కానీ, తొణకలేదు. పైగా తల్లిదండ్రుల కన్నీళ్లను చిట్టిచేతులతో తుడిచింది. ఎదురించి పోరాడింది. ఎట్టకేలకు.. చిన్నప్పటి కలను సాధించుకుంది. ఏకంగా ప్రపంచ అందాల పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. శ్రీ సైని(26).. భారత మూలాలు ఉన్న యువతి కావడం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. Miss World 2021 పోటీలు మార్చి 17వ తేదీన ప్యూర్టో రికా, శాన్ జువాన్లోని కోకా కోలా హాల్లో ఘనంగా జరిగాయి. పోలాండ్ సుందరి కరోలీనా బెయిలాస్కా(23) Karolina Bielawska ప్రపంచ సుందరి టైటిల్ నెగ్గింది. మాజీ సుందరి జమైకాకు చెందిన టోనీ అన్సింగ్.. ప్రపంచ సుందరి కిరీటంతో కరోలీనాను సత్కరించింది. మొదటి రన్నరప్‌గా మిస్ అమెరికా 2021 శ్రీ సైని నిలవగా.. రెండో రన్నరప్‌గా పశ్చిమ ఆఫ్రికా దేశం కోట్ డీల్వోరికు చెందిన ఒలీవియా యాసే నిలిచింది. ఈ ముగ్గురిలో శ్రీ సైని.. ఇండో అమెరికన్ కాగా.. ఆమె జీవితం ఎంతో స్ఫూర్తిదాయం కూడా. Our newly crowned Miss World Karolina Bielawska from Poland with 1st Runner Up Shree Saini from United States 2nd Runner up Olivia Yace from Côte d’Ivoire#missworld pic.twitter.com/FFskxtk0KO — Miss World (@MissWorldLtd) March 17, 2022 శ్రీ సైని నేపథ్యం.. అందాల పోటీల్లో భారత సంతతి యువతి శ్రీ సైని ఆకట్టుకుంది. 26 ఏళ్ల సైని.. ప్రపంచ సుందరీమణుల పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. కిందటి ఏడాది అక్టోబర్‌లో జరిగిన మిస్ అమెరికా పోటీల్లో ఆమె విజేతగా నిలిచిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ►మిస్ వరల్డ్ ఫస్ట్ రన్నరప్ శ్రీ సైని స్వస్థలం పంజాబ్‌లోని లూథియానా. సైనికి ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె కుటుంబం వాషింగ్టన్కు వలస వెళ్లింది. పసితనం నుంచే ఆమె అడుగులు.. ముళ్ల బాటలో సాగాయి. ► ఐదేళ్ల వయసులో ఆమెకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. గుండె సంబంధిత సమస్యలతో బాధపడింది ఆమె. అందరి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే.. శ్రీ సైనికి కేవలం 20సార్లు మాత్రమే కొట్టుకునేది. ఆమె అందరు పిల్లలాగా ఆడుకోలేని డాక్టర్లు చెప్పారు. చివరికి.. పన్నెండవ ఏటా ఓపెన్ హార్ట్ సర్జరీతో పేస్‌మేకర్ అమర్చారు. ఆపై ఆమె మిగతా పిల్లల్లాగే గెంతులేస్తూ ఆడింది. ► సవ్యంగా సాగుతున్న శ్రీ సైనిపై మరో పిడుగు పడింది. ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె ముఖం బాగా కాలిపోయింది. కానీ, శ్రీ షైని కుంగిపోలేదు. ఆమె కోలుకోవడానికి ఏడాది టైం పడుతుందని వైద్యులు చెప్పారు. కానీ, ఆశ్చర్యకర రీతిలో కేవలం రెండు వారాలకే ఆమె తరగతి గదిలో అడుగుపెట్టింది. తల్లిదండ్రులతో శ్రీ సైని(పాత చిత్రం) ► చిన్నతనంలోనే ప్రపంచ సుందరి కావాలన్న కల నెరవేర్చుకునేందుకు.. ప్రయత్నించింది. కాలిన ఆ మరకలను సహజంగా తగ్గించుకునే ప్రయత్నం చేసింది. అందాల పోటీల్లో పాల్గొంది. 2020లో Miss Washington World గెల్చుకుంది. ► ఆపై మిస్ అమెరికా 2021 కిరీటం దక్కించుకుంది. మిస్ అమెరికా ఫైనల్ పోటీలకు ముందురోజు.. స్టేజ్ మీదే కుప్పకూలిన ఆమె ఆస్పత్రి పాలైంది. అయినా ఆ మరుసటి రోజు నెర్వస్ను పక్కనపెట్టి కిరీటాన్ని దక్కించుకుంది. ఆమె స్ఫూర్తిదాయకమైన ప్రయాణానికి గానూ.. మిస్ వరల్డ్ బ్యూటీ విత్ ఏ పర్పస్(BWAP) అంబాసిడర్ హోదా కూడా దక్కింది. ► ముఖ కాలిన గాయాలు, గుండె లోపాన్ని అధిగమించిన నా కథ.. రోజువారీ సవాళ్లను అధిగమించడానికి ఇతరులను ప్రోత్సహిస్తుందని నేను ఆశిస్తున్నా. నేను కేవలం 6 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, నేను మిస్ వరల్డ్ వేషం వేసుకున్నాను, ఎందుకంటే నేను మిస్ వరల్డ్‌ను సూపర్ హీరోగా చూశాను. సేవ చేయాలనే ఉద్దేశ్యం నాకు కష్ట సమయాల్లో బలాన్నిచ్చింది. నాకు కష్టాలు తెలుసు. బతకాలనే సంకల్పం నా జీవితాన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది అంటోంది శ్రీ సైని. View this post on Instagram A post shared by SHREE SAINI👑MISS WORLD 1st RU (@shreesaini) -
వయ్యారి భామా.. నీ హంస నడకా! ఇండియన్ సిల్క్ క్వీన్ విజేతలు వీరే!
బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ‘ఇండియన్ సిల్క్ క్వీన్’ పోటీలు విశాఖపట్నంలో వైభవంగా జరిగాయి. వీరుమామ ఈవెంట్స్ ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డులో ని వైఎంసీఏ వద్ద బుధవారం ఈ పోటీలు నిర్వహించారు. వివాహితులు, యువతులకు వేర్వేరుగా నిర్వహించిన పోటీల్లో.. పెద్ద ఎత్తున మహిళలు, యువతులు పాల్గొని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. వివాహితుల పోటీల్లో విజేతగా ప్రసన్న, మొదటి రన్నర్‌గా సుధారాణి, రెండో రన్నర్‌గా సౌజన్య.. యువతుల పోటీల్లో విజేతగా రాజన్ సరితారాణి, మొదటి రన్నర్‌గా సాజహత్న శ్రీన్, రెండో రన్నర్‌గా మనీషా నిలిచారు. వీరికి ప్రేమ సమాజం అధ్యక్షుడు పైడా కృష్ణప్రసాద్, వైఎస్సార్ సీపీ మహిళా నాయకురాలు పేడాడ రమణికుమారి, వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు బహుతులు ప్రదానం చేశారు. న్యాయ నిర్ణీతలుగా మిస్సెస్ ఆంధ్రా సునీత, సోనియా వ్యవహరించారు. సంప్రదాయ చీరకట్టు, సంస్కృతిని భవిష్యత్ తరాలు కొనసాగించాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పే క్రమంలో ఈ పోటీలను నిర్వహించారు. -
మిస్ యూనివర్స్‌గా జోజిబినీ తుంజీ
-
నా ముఖం చూడండి: మిస్ యూనివర్స్
అట్లాంటా: ఈ ఏడాది విశ్వసుందరిగా దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబినీ తుంజీ(26) ఎంపికయ్యారు. మొత్తం తొంభై మంది అందాల భామలు పాల్గొన్న ఈ పోటీలో మిస్ దక్షిణాఫ్రికా తుంజీ విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నారు. అమెరికాలోని అట్లాంటాలోని టైలర్ పెర్రీ స్టూడియోస్‌లో జరిగిన ఈ అందాల పోటీలకు పాపులర్ టీవీ పర్సనాలిటీ స్టీవ్ హార్వే హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక ఏడుగురు మహిళలతో కూడిన బృందం ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించింది. ఫైనల్లో ప్యూర్టో రికన్, మెక్సికన్ భామలను వెనక్కి నెట్టి జోజిబినీ తుంజీ విజేతగా నిలిచినట్లు వారు ప్రకటించారు. ఈ క్రమంలో తుంజీ మాట్లాడుతూ... ‘అచ్చం నాలాగే కనిపించే మహిళలు ఉన్న ప్రపంచలో నేను పెరిగాను. వారిది కూడా నాలాంటి శరీర వర్ణమే. శిరోజాలు కూడా నా వంటివే. అయితే మమ్మల్ని ఎవరూ ఎప్పుడూ సౌందర్యరాశులుగా పరిగణించలేదు. నేటి నుంచి ఆ భావన తొలగిపోతుందనుకుంటున్నా. అలా అనుకునే వాళ్లు నా ముఖం చూడండి. నా ముఖంలో ప్రతిబింబిస్తున్న మీ ముఖాలు చూసుకోండి’ అని తన దేశ మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపారు. అనంతరం మిస్ యూనివర్స్-2018 కాట్రియోనా గ్రే(ఫిలిప్పైన్స్) తుంజీకి విశ్వ సుందరి కిరీటం అలంకరించగా.. తుంజీ కన్నీటి పర్యంతమయ్యారు. ‘ఇంకా చేయాల్సి చాలా ఉంది’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Making a statement... This is Miss Universe South Africa.#MissUniverse2019 LIVE on @FOXtv. Airing in Spanish on @Telemundo. pic.twitter.com/FWpqb0517w — Miss Universe (@MissUniverse) December 9, 2019 -
నన్ను ప్రధాని ఆహ్వానిస్తే.. అదే చెప్తా!
న్యూఢిల్లీ: ఆమె ఈశాన్య భారతానికి చెందిన అందాల పోటీలో కంటెస్టెంట్. 2019 మిస్ కోహిమా అందాల పోటీలో మొదటి రన్నరప్‌గా నిలిచారు. అందాల పోటీలో ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి ఆమె ఇచ్చిన సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆవుల కన్నా మహిళల మీద ప్రధాని మోదీ ఎక్కువ శ్రద్ధ పెట్టాలని ఆమె సూచించారు. అందాలపోటీ ఫైనల్ రౌండ్ భాగంగా జ్యూరీ సువోహును ప్రశ్నిస్తూ.. ‘ప్రధాని నరేంద్రమోదీ మిమ్మలి పిలిచి మాట్లాడితే.. మీరు ఏం మాట్లాడారు?’ అని అడిగింది. దీనికి సువోహు సమాధానమిస్తూ.. ‘నన్ను భారత ప్రధాని మాట్లాడేందుకు పిలిస్తే.. ఆవుల మీద కన్నా మహిళల మీద ఎక్కువ శ్రద్ధ చూపాలని ఆయనకు చెప్తాను’అంటూ సూటిగా సమాధానం చెప్పారు. ఆమె తెలివిగా ఇచ్చిన ఈ సమాధానంతో ఆడియేన్స్‌లో నవ్వులు విరిశాయి. పదిరోజుల కిందట నాగాలాండ్‌లోని జోట్సోమాలో ఈ అందాల పోటీ ఫైనల్ రౌండ్ జరిగింది. ‘ఎడ్యుకేట్ ఏ గర్ల్.. ఎంపవర్ ఏ సొసైటీ’ అనే థీమ్‌తో స్థానిక అగాథోస్ సొసైటీ ఈ అందాల పోటీని నిర్వహించింది. అందాల పోటీలో సువోహు ఇచ్చిన సమాధానంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. -
అందాలు ఆరబోద్దామనే అత్యుత్సాహంలో..
-
అందాలు ఆరబోద్దామనే అత్యుత్సాహంలో..
ఓ మోడల్ అత్యుత్సాహం ప్రాణం మీదకు తెచ్చింది. తాను ధరించిన వినూత్న వస్త్రాలను ప్రదర్శించేందుకు ర్యాంప్‌పై ముందుకెళ్లిన మోడల్ అలంకరణకు నిప్పు అంటుకోవడంతో క్షణాల్లో భయానక వాతావరణం అలుముకుంది. కళ్లుమూసి తెరిచేలోగా మంటలు ఆమె తలపై డిజైన్ చేసిన ప్రత్యేక అలంకరణను కాలి బూడిదైంది. నిర్వాహకులు అప్రమత్తంగా ఉండి మంటలు ఆర్పడంతో ఆమె స్వల్పగాయాలతో బయటపడింది. ఈ ఘటన ఎవన్ సాల్వడోర్లో చోటుచేసుకుంది. ర్యాంప్ చివర్లో చేతిలో దివిటీలతో కొంతమంది వ్యక్తులను ఆకర్షణగా పెట్టడంతో వారి చేతుల్లోని నిప్పు కాస్త ఆమె డిజైన్‌కు అంటుకోవడంతో ఆ ప్రమాదం సంభవించింది. ఆ వీడియోను మీరు కూడా వీక్షించండి. -
చంపేస్తామని బెదరించినా.. ఇరాక్‌లో అందాలపోటీ!
ఇరాక్ లాంటి ఛాందస దేశంలో.. మహిళలు బురఖా లేకుండా బయటకు రావడమే కష్టం. ఏవైనా ఆటల్లో వాళ్లు తమ దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్నా కాళ్లు కూడా కనపడకుండా దుస్తులు ధరించి పాల్గొనాలి. అలాంటి దేశంలో అందాల పోటీలు నిర్వహించడం అంటే మాటలా? కానీ.. 43 ఏళ్లలో తొలిసారిగా అక్కడ అందాల పోటీలు నిర్వహించారు. వాటిలో పాల్గొంటే చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చినా లెక్క చేయకుండా షైమా ఖాసిం అనే యువతి మిస్ ఇరాక్ టైటిల్ గెలుచుకుంది. ఇరాక్‌లో కూడా ఇలాంటి పోటీలు జరగాలని ఈ పోటీల డైరెక్టర్ అహ్మద్ లీత్ అన్నారు. ఇక్కడి పరిస్థితి మరీ దారుణంగా ఉందని, లెబనాన్ లాంటి ఇతర దేశాలు చేస్తున్నట్లే తాము కూడా అందాల పోటీలు పెడదామని అనుకున్నామని ఆయన చెప్పారు. తొలుత ఈ పోటీల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలోనే అమ్మాయిలు ముందుకొచ్చినా, తర్వాత పోటీ తేదీ దగ్గరకు వచ్చేకొద్దీ.. క్రమంగా పల్చబడ్డారు. ఈ పోటీకి సంబంధించిన వెబ్సైట్లోను, ఫేస్బుక్ పేజిలోను లెక్కలేనన్ని హెచ్చరికలు పోస్ట్ అయ్యాయి. అన్నింటిలో ఉన్నది... అమ్మాయిలను చంపేస్తామన్న బెదిరింపులే. దాంతో మొదట్లో 200 మంది వరకు వచ్చిన పోటీదారులు, తర్వాత 10 మందికి పడిపోయారు. చివరకు యూనివర్సిటీ ఆఫ్ కిర్కుక్లో ఎకనమిక్స్ చదువుతున్న షైమా ఖాసిం (20) కిరీటాన్ని గెలుచుకుంది. అన్ని రకాల బెదిరింపులు, కష్టాలను దాటుకుని ఆమె ఈ కిరీటం గెలుచుకుందని, ఇది కేవలం ఈ పోటీలో విజయం మాత్రమే కాదని.. ఆమె తన జీవిత పోరాటంలో కూడా విజయం సాధించిందని అక్కడ అంతా అంటున్నారు. -
వావ్.. పెయ్యల ఫ్యాషన్ షో
నెల్లూరు(అగ్రికల్చర్): ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒంగోలు జాతి పశువుల అందాల ప్రదర్శనలో భాగంగా శనివారం నిర్వహించిన పెయ్యల ప్రదర్శన అబ్బురపరిచింది. స్థానిక కనుపర్తిపాడులోని పూండ్ల వెంకురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మైదానం సంక్రాంతి శోభను సంతరించుకుంది. తెలంగాణ, ఆంధ్రాలోని పలు ప్రాంతాల నుంచి పలువురు తమ పశువులతో ఉత్సాహంగా తరలివచ్చారు. నెల్లూరులో మొదటిసారిగా నిర్వహించిన ప్రదర్శన కావడంతో తిలకించేందుకు జిల్లా వా సులు ప్రత్యేక ఆసక్తి చూపారు. నెల్లూరు సిటీ, రూరల్, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యూదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య ప్రదర్శనను తిలకించి నిర్వాహకులను ప్రశంసించారు. పెయ్యల విభాగంలో నెల్లూరుకు నాలుగు బహుమతులు రావడం స్థానికులను ఉత్తేజపరచింది. ఆవుల విభాగంలోనూ మూడు స్థానాలను నెల్లూరు కైవసం చేసుకుంది. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన పశువులకు వరుసగా రెడ్, గ్రీన్, ఎల్లో రిబ్బన్లను అలంకరించారు. ఆదివారం గిత్తల పోటీలను నిర్వహించనున్నారు. సాయంత్రం జరిగే ముగింపు సభలో నగదు, జ్ఞాపికలు అందజేయనున్నారు. ప్రదర్శన ఏర్పాట్లను పూండ్ల వెంకురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధినేత వెంకురెడ్డి, మైనేజింగ్ డెరైక్టర్ సతీష్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, మేనేజర్ సుబ్బారెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి పర్యవేక్షించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ పోలుబోయిన రూప్‌కుమార్‌యాదవ్, నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు జాతి లక్షణాలే ప్రామాణికం అందాల ప్రదర్శనలో ఒంగోలుజాతి లక్షణాలనే ప్రామాణికంగా తీసుకొని విజేతలుగా నిర్ణయిస్తున్నామని న్యాయనిర్ణేతలు, విశ్రాంత పశువైద్యులు బి.సీతారెడ్డి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ గురవారెడ్డి తెలిపారు. తలకట్టు, కళ్లు, కొమ్ములు, మెడ పొడవు, చెండు, తోక పొడవు, కుచ్చు, కాళ్లు, గిట్టలు, బొడ్డు, చర్మ సౌందర్యం, వృషణాలు తది తర అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. న్యాయనిర్ణేతలుగా పశువైద్యులు డాక్టర్ వెంకటస్వామిరెడ్డి, ప్రభాకర్‌గుప్తా, కె.కోటేశ్వరరావు కూడా వ్యవ హరిస్తున్నారు. ఒంగోలు జాతి సంతతి అభివృద్ధే లక్ష్యం ఒంగోలు జాతి సంతతి అభివృద్దే లక్ష్యంగా ఐదు గిత్తలను పెంచుతున్నాము. విత్తన గిత్తలుగా వీటిని వినియోగిస్తూ ఒంగోలు జాతి పశు సంపద అభివృద్ధికి కృషి చేస్తున్నాను. గో సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శనకు విత్తన గిత్తలను తీసుకొచ్చాను. - నల్లబోలు కోటయ్య, తుర్లుపాడు, ప్రకాశం జిల్లా విజేతలు: పెయ్యల విభాగంలో.. పాలపళ్ల విభాగంలో ఆరు పెయ్యలు అందాలను ప్రదర్శించాయి. రంగారెడ్డి జిల్లా గో సేవాసంఘంకు చెందిన భారతినారాయణరెడ్డి పెయ్య మొదటి స్థానం కైవసం చేసుకుంది. రెండో స్థానంలో ఇందుకూరుపేట మండలం జేజేపేటకు చెందిన కదురు సాగర్‌రెడ్డి పెయ్య, మూడో స్థానంలో ఖమ్మం జిల్లా పాతలింగాల నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఆర్ఎంరెడ్డికి చెందిన పెయ్య నిలిచారుు. ఒక జత పళ్ల విభాగంలో 5 పెయ్యలు అందాలను ప్రదర్శించాయి. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరుకు చెందిన చి లంకూరి పూర్ణలక్ష్మి, ప్రకాశం జిల్లా లింగంగుంటకు చెందిన షేక్ మహ్మద్ అలీ, నెల్లూరు పూండ్ల వెంకురెడ్డి గోశాలకు చెందిన పెయ్యలు మొదటి మూడు స్థానాల్లో నిలిచారుు. రెండు జతలు, మూడు జతల పళ్ల విభాగంలో ఆరు పెయ్యలు అందాలను ప్రదర్శించాయి. కోవూరు మండలం లేగుంటపాడుకు చెందిన తుంగా సుజిత్‌రెడ్డి, నెల్లూరు పూండ్ల వెంకురెడ్డి, ప్రకాశం జిల్లాకు చెందిన నల్లబోలు కోటయ్య పెయ్యలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారుు. ఆవుల విభాగంలో 29 పశువులు అందాలను ప్రదర్శించాయి. ఈ విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు జిల్లాకే దక్కారుు. పూండ్ల వెంకురెడ్డి, సర్వేపల్లి వినోద్‌కుమార్, పెద్దచెరుకూరు మాధవగోశాలకు చెందిన ఆవులు మొదటి మూడు స్థానాల్లో నిలిచారుు. రెండు గిత్తలను పెంచుతాను ఒంగోలు జాతి ఆవులు, గిత్తలు ఇంటి ఆవరణలో ఉండటం ఎంతో శ్రేయస్కరం. ఆవులను పెంచే ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో కళకళలాడుతుంది. గో సంపద అంతరించిపోతున్న తరుణంలో పూండ్ల వెంకురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఒంగోలు జాతి పశు ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయం. ఈ జాతి పశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. గతంలో ప్రతి ఒక్కరి ఇళ్లలో ఆవులు ఉండేవి. ఇప్పుడు కూడా ఆవులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రదర్శన చూసిన తర్వాత నేను కూడా గిత్తలను పెంచుకోవాలనుకుంటున్నాను. తప్పనిసరిగా రెండు గిత్తలను పెంచుతాను. - అనిల్, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే సంతోషంగా ఉంది రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఒంగోలు జాతి పశువుల ప్రదర్శన అలరిస్తోంది. నిర్వాహకులైన పూండ్ల వెంకురెడ్డి చారిటబుల్ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఒంగోలు జాతి పశువుల ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్రదర్శనను నిర్వహించడం సంతోషంగా ఉంది. జిల్లా ప్రజలందరూ ఈ ప్రదర్శనను తిలకించాలి. వివిధ జిల్లాల నుంచి ఒంగోలు జాతి పశువులు తీసుకొచ్చిన యజమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు. - కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే పశు సంపదను కాపాడుకోవాలి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు జాతి పశుసంపదను కాపాడుకోవాలి. మన పూర్వీకులు ప్రతి ఇంట్లో ఒంగోలు జాతి ఆవులు, గిత్తలను పెంచుకునేవారు. వ్యవసాయానికి, పాడి పరిశ్రమ అభివృద్ధికి అవి ఎంతగానో ఉపయోగపడేవి. ప్రస్తుతం యంత్రాలు వాడుకలోకి రావడంతో పశుసంపద అంతరించిపోతుంది. ప్రతి కుటుంబం కనీసం ఒక ఆవునైనా పెంచుకుంటే బావుంటుంది. - కిలివేటి సంజీవయ్య, సూళ్లూరుపేట ఎమ్మెల్యే -
ఖైదీభామల క్యాట్‌వాక్
కురచ దుస్తులు ధరించి వయ్యారాలు ఒలకబోస్తున్న ఈ అందగత్తెలు నిజానికి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు. కొలంబియా దేశంలో మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణాచేస్తూ దొరికిపోయిన వీరంతా శుక్రవారం బొగోటా నగర జైలులో ఇలా అందాల పోటీల్లో పాల్గొన్నారు. ‘రివర్స్’ కారు! రేసులో యాక్సిడెంట్ అయి కారు బోల్తాపడలేదు. సరిగ్గా చూడండి.. కారే అలాగుంది. రీమోడలింగ్‌లో స్పెషలిస్టు అయిన అమెరికాకు చెందిన జెఫ్ బ్లోచ్ దీన్నిలా తయారుచేశాడు. ఆ మధ్య చిన్నపాటి సెస్నా విమానాన్ని రేస్కారులా మార్చేసిన జెఫ్.. తాజాగా అక్కడి ప్రఖ్యాత లెమన్ రేసులో పాల్గొనడం కోసం ఈ వినూత్న వాహనాన్ని రూపొందించాడు. కారు క్లీనింగ్ యమ కాస్టలీ! కారు కడిగించుకోవాలి.. టెఫ్లాన్ కోటింగ్ వేయించుకోవాలి... మహా అయితే ఎంతవుతుంది? రూ.2, 3 వేలకు మించి అవదు అంతేగా.. ఓసారి స్కాట్లాండ్లోని కిర్కకాల్డీలో ఉన్న ‘అల్టిమేట్ షైన్’ కంపెనీలో కారు క్లీనింగ్ చేయించుకుని చూడండి.. అక్కడి వాళ్లు మీ కారును కడగడంతోపాటు బ్యాంకులో ఉన్న మొత్తం సొమ్మునూ కడిగిపారేస్తారు. ఎందుకంటే.. వీరు రెండు కార్ల క్లీనింగ్‌కు ఏడాదికి రూ.90 లక్షలు చార్జి చేస్తారు! అలాగని.. ప్రతి నెలా క్లీన్ చేస్తారనుకునేరు.. ఏడాదికి మహా అయితే.. మూడు లేదా నాలుగుసార్లు కడుగుతారు అంతే..