న్యూఢిల్లీ: ఆమె ఈశాన్య భారతానికి చెందిన అందాల పోటీలో కంటెస్టెంట్. 2019 మిస్ కోహిమా అందాల పోటీలో మొదటి రన్నరప్‌గా నిలిచారు. అందాల పోటీలో ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి ఆమె ఇచ్చిన సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆవుల కన్నా మహిళల మీద ప్రధాని మోదీ ఎక్కువ శ్రద్ధ పెట్టాలని ఆమె సూచించారు.
అందాలపోటీ ఫైనల్ రౌండ్ భాగంగా జ్యూరీ సువోహును ప్రశ్నిస్తూ.. ‘ప్రధాని నరేంద్రమోదీ మిమ్మలి పిలిచి మాట్లాడితే.. మీరు ఏం మాట్లాడారు?’ అని అడిగింది. దీనికి సువోహు సమాధానమిస్తూ.. ‘నన్ను భారత ప్రధాని మాట్లాడేందుకు పిలిస్తే.. ఆవుల మీద కన్నా మహిళల మీద ఎక్కువ శ్రద్ధ చూపాలని ఆయనకు చెప్తాను’అంటూ సూటిగా సమాధానం చెప్పారు. ఆమె తెలివిగా ఇచ్చిన ఈ సమాధానంతో ఆడియేన్స్‌లో నవ్వులు విరిశాయి. పదిరోజుల కిందట నాగాలాండ్‌లోని జోట్సోమాలో ఈ అందాల పోటీ ఫైనల్ రౌండ్ జరిగింది. ‘ఎడ్యుకేట్ ఏ గర్ల్.. ఎంపవర్ ఏ సొసైటీ’ అనే థీమ్‌తో స్థానిక అగాథోస్ సొసైటీ ఈ అందాల పోటీని నిర్వహించింది. అందాల పోటీలో సువోహు ఇచ్చిన సమాధానంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment