బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ‘ఇండియన్ సిల్క్ క్వీన్’ పోటీలు విశాఖపట్నంలో వైభవంగా జరిగాయి. వీరుమామ ఈవెంట్స్ ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డులో ని వైఎంసీఏ వద్ద బుధవారం ఈ పోటీలు నిర్వహించారు. వివాహితులు, యువతులకు వేర్వేరుగా నిర్వహించిన పోటీల్లో.. పెద్ద ఎత్తున మహిళలు, యువతులు పాల్గొని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు.
వివాహితుల పోటీల్లో విజేతగా ప్రసన్న, మొదటి రన్నర్‌గా సుధారాణి, రెండో రన్నర్‌గా సౌజన్య.. యువతుల పోటీల్లో విజేతగా రాజన్ సరితారాణి, మొదటి రన్నర్‌గా సాజహత్న శ్రీన్, రెండో రన్నర్‌గా మనీషా నిలిచారు. వీరికి ప్రేమ సమాజం అధ్యక్షుడు పైడా కృష్ణప్రసాద్, వైఎస్సార్ సీపీ మహిళా నాయకురాలు పేడాడ రమణికుమారి, వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు బహుతులు ప్రదానం చేశారు. న్యాయ నిర్ణీతలుగా మిస్సెస్ ఆంధ్రా సునీత, సోనియా వ్యవహరించారు. సంప్రదాయ చీరకట్టు, సంస్కృతిని భవిష్యత్ తరాలు కొనసాగించాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పే క్రమంలో ఈ పోటీలను నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment