చంపేస్తామని బెదరించినా.. ఇరాక్‌లో అందాలపోటీ! | shaima qasim wins miss iraq title | Sakshi
Sakshi News home page

చంపేస్తామని బెదరించినా.. ఇరాక్‌లో అందాలపోటీ!

Published Tue, Dec 22 2015 7:19 PM | Last Updated on Sun, Sep 3 2017 2:24 PM

చంపేస్తామని బెదరించినా.. ఇరాక్‌లో అందాలపోటీ!

చంపేస్తామని బెదరించినా.. ఇరాక్‌లో అందాలపోటీ!

ఇరాక్ లాంటి ఛాందస దేశంలో.. మహిళలు బురఖా లేకుండా బయటకు రావడమే కష్టం. ఏవైనా ఆటల్లో వాళ్లు తమ దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్నా కాళ్లు కూడా కనపడకుండా దుస్తులు ధరించి పాల్గొనాలి. అలాంటి దేశంలో అందాల పోటీలు నిర్వహించడం అంటే మాటలా? కానీ.. 43 ఏళ్లలో తొలిసారిగా అక్కడ అందాల పోటీలు నిర్వహించారు. వాటిలో పాల్గొంటే చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చినా లెక్క చేయకుండా షైమా ఖాసిం అనే యువతి మిస్ ఇరాక్ టైటిల్ గెలుచుకుంది. ఇరాక్‌లో కూడా ఇలాంటి పోటీలు జరగాలని ఈ పోటీల డైరెక్టర్ అహ్మద్ లీత్ అన్నారు. ఇక్కడి పరిస్థితి మరీ దారుణంగా ఉందని, లెబనాన్ లాంటి ఇతర దేశాలు చేస్తున్నట్లే తాము కూడా అందాల పోటీలు పెడదామని అనుకున్నామని ఆయన చెప్పారు.

తొలుత ఈ పోటీల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలోనే అమ్మాయిలు ముందుకొచ్చినా, తర్వాత పోటీ తేదీ దగ్గరకు వచ్చేకొద్దీ.. క్రమంగా పల్చబడ్డారు. ఈ పోటీకి సంబంధించిన వెబ్‌సైట్‌లోను, ఫేస్‌బుక్ పేజిలోను లెక్కలేనన్ని హెచ్చరికలు పోస్ట్ అయ్యాయి. అన్నింటిలో ఉన్నది... అమ్మాయిలను చంపేస్తామన్న బెదిరింపులే. దాంతో మొదట్లో 200 మంది వరకు వచ్చిన పోటీదారులు, తర్వాత 10 మందికి పడిపోయారు. చివరకు యూనివర్సిటీ ఆఫ్ కిర్కుక్‌లో ఎకనమిక్స్ చదువుతున్న షైమా ఖాసిం (20) కిరీటాన్ని గెలుచుకుంది. అన్ని రకాల బెదిరింపులు, కష్టాలను దాటుకుని ఆమె ఈ కిరీటం గెలుచుకుందని, ఇది కేవలం ఈ పోటీలో విజయం మాత్రమే కాదని.. ఆమె తన జీవిత పోరాటంలో కూడా విజయం సాధించిందని అక్కడ అంతా అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement