అట్లాంటా: ఈ ఏడాది విశ్వసుందరిగా దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబినీ తుంజీ(26) ఎంపికయ్యారు. మొత్తం తొంభై మంది అందాల భామలు పాల్గొన్న ఈ పోటీలో మిస్ దక్షిణాఫ్రికా తుంజీ విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నారు. అమెరికాలోని అట్లాంటాలోని టైలర్ పెర్రీ స్టూడియోస్‌లో జరిగిన ఈ అందాల పోటీలకు పాపులర్ టీవీ పర్సనాలిటీ స్టీవ్ హార్వే హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక ఏడుగురు మహిళలతో కూడిన బృందం ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించింది. ఫైనల్‌లో ప్యూర్టో రికన్, మెక్సికన్ భామలను వెనక్కి నెట్టి జోజిబినీ తుంజీ విజేతగా నిలిచినట్లు వారు ప్రకటించారు.
ఈ క్రమంలో తుంజీ మాట్లాడుతూ... ‘అచ్చం నాలాగే కనిపించే మహిళలు ఉన్న ప్రపంచలో నేను పెరిగాను. వారిది కూడా నాలాంటి శరీర వర్ణమే. శిరోజాలు కూడా నా వంటివే. అయితే మమ్మల్ని ఎవరూ ఎప్పుడూ సౌందర్యరాశులుగా పరిగణించలేదు. నేటి నుంచి ఆ భావన తొలగిపోతుందనుకుంటున్నా. అలా అనుకునే వాళ్లు నా ముఖం చూడండి. నా ముఖంలో ప్రతిబింబిస్తున్న మీ ముఖాలు చూసుకోండి’ అని తన దేశ మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపారు. అనంతరం మిస్ యూనివర్స్-2018 కాట్రియోనా గ్రే(ఫిలిప్పైన్స్) తుంజీకి విశ్వ సుందరి కిరీటం అలంకరించగా.. తుంజీ కన్నీటి పర్యంతమయ్యారు. ‘ఇంకా చేయాల్సి చాలా ఉంది’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Making a statement... This is Miss Universe South Africa.#MissUniverse2019 LIVE on @FOXtv. Airing in Spanish on @Telemundo. pic.twitter.com/FWpqb0517w
— Miss Universe (@MissUniverse) December 9, 2019
Comments
Please login to add a commentAdd a comment