Finalist
-
Miss Universe Korea : జస్ట్ 80!
సియోల్: పేరు: చోయి సూన్ హ్వా, వయస్సు:80. ఇటీవలే మిస్ యూనివర్స్ కొరియాఫైనలిస్ట్ల్లో ఒకరిగా నిలిచిరికార్డు బద్దలు కొట్టారు. త్వరలో జరగబోయే మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొని, వయోధికురాలిగా చరిత్ర సృష్టించబోతున్నారు. మిస్ యూనివర్స్ పోటీలు ప్రారంభమవ్వడానికి దశాబ్ధం ముందు 1952లో ఈమె జన్మించారు. ఈ నెలారంభంలో మిస్ యూనివర్స్ కొరియా పోటీలో ఫైనలిస్ట్‌గా నిలిచారు. సోమవారం మరో 31 మంది పోటీదారులతో ‘మిస్ యూనివర్స్ కొరియా’కిరీటం కోసం పోటీ పడనున్నారు. ఇందులో విజేతగా నిలిస్తే నవంబర్‌లో మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ ఫైనల్స్‌లో దక్షిణ కొరియాకు ప్రాతినిథ్యం వహించే ఛాన్స్ కొట్టేయనున్నారు. ‘80 ఏళ్ల మహిళ ఇంత ఆరోగ్యంగా ఎలా ఉండగలిగారు? శరీర సౌష్టవాన్ని ఎలా నిలుపుకోగలిగారు? ఏ ఆహారం తీసుకుంటున్నారు? అని ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యపరచాలనుకుంటున్నా’అని ఆమె సీఎన్ఎన్తో అన్నారు. హాస్పిటల్లో చిన్న ఉద్యోగం చేసి రిటైరైన చోయి..ఆర్థిక ఇబ్బందుల కారణంగా మళ్లీ ఆ ఉద్యోగంలో చేరారు. మోడలింగ్ రంగంలోకి వెళ్లాలని తన వద్దకు వచ్చే రోగి ఒకరు ప్రోత్సహించారని ఆమె చెప్పారు. ‘మొదట్లో ఆమె సలహా అర్థం లేనిదిగా అనిపించింది. ఆ తర్వాత నా చిన్ననాటి అభిరుచిని నెరవేర్చుకునేందుకు ఇదే సమయమని తోచింది’అని తెలిపారు. అదే సమయంలో అప్పులు ఆమెకు భారంగా మారాయి. అలా, 72 ఏళ్ల వయసులో మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు. 2018లో 74 ఏళ్ల వయస్సులో సియోల్ ఫ్యాషన్ వీక్‌లో మొట్టమొదటిసారిగా కనిపించారు. ఆ తర్వాత హార్పర్స్ బజార్, ఎల్ల్ మ్యాగజీన్లలో కనిపించారు. ఇప్పుడు, కొరియన్ ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె తనకంటూ స్థానం సంపాదించుకున్నారు. -
మిస్ ఏఐ అందాల పోటీలో టాప్ 10 ఫైనలిస్ట్‌గా జరా శతావరి!
ప్రపంచంలోనే తొలిసారి ఏఐతో రూపొందించిన మోడల్‌ల కోసం అందాల పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ అందాల పోటీల్లో టాప్ టెన్ ఫైనలిస్ట్‌గా భారతదేశానికి చెందిన జరా శతావరి నిలిచారు. ఆమె పీసీఓఎస్ , డిప్రెషణ యోధురాలు. ప్రపంచంలోనే తొలిసారిగా జరుగుతున్న వర్చ్యువల్ హ్యుమన్ అందాల పోటీల్లో పాల్గొన్న దాదాపు 1500 మంది అభ్యర్థులో భారతకి ప్రాతినిధ్యం వహిస్తున్న శతావరి ఎంపక కావడం విశేషం. అయితే ఈ పోటీల్లో అందం, సాంకేతికత, సోషల్ మీడియా ప్రభావం ఆధారంగా ఈ నెలాఖరులోగా విజేతలను నిర్ణయించడం జరుగుతుంది. ఇంతకీ ఎవరీమె అంటే..ఎవరీ జరా శతావరి.?ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు ఏడువేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. జరాకి భోజనం, ట్రావెలింగ్ అంటే మహా ఇష్టం. ప్రజలను ఆరోగ్యం, వృత్తి, అభివృద్ధి, ఫ్యాషన్ పరంగా మంచి జీవితాన్ని గడిపేలా శక్తిమంతం చేయడం ఆమె లక్ష్యం. ఇక ఆమె వర్చువల్ ప్రయాణంలో జూన్ 2023 నుంచి పీఎంహెచ్ బయోకేర్కి బ్రాండ్ అంబాసిడర్" ఉంది. అలాగే ఆగస్టు 2024లో డిజిమోజో ఈ సర్వీస్ ఎల్ఎల్పీలో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ టాలెంట్ మేనేజర్‌గా చేరింది.అంతేగాదు ఆమె 13 రంగాల్లో నైపుణ్యం కలిగి ఉంది. వ్యూహాత్మక ప్లానింగ్‌లో, కంటెంట్ అభివృద్ధి, డేటా విశ్లేషణ, బ్రాండ్ అవగాహన, బ్రాండ్ అడ్వకేసీ, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, సృజనాత్మక ఆలోచన, ఆరోగ్యం అండ్ సంరక్షణ కౌన్సిలింగ్, ఫ్యాషన్ స్టైలింగ్ అండ్ కెరీర్ డెవలప్మెంట్ గైడెన్స్లలో మంచి నైపుణ్యం ఉంది ఆమెకు. తనని తాను డిజిటల్ మీడియా మావెన్గా అభివర్ణించే రాహుల్ చౌదరి మిస్ ఏఐ అందాల పోటీల్లో శతావరి టాప్ 10లో ఉందని ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. దాదాపు 1500 మంది పాల్గొనే ఈ పోటీల్లో ఆమెకు టాప్ 10లో చోటు దక్కడం విశేషం అని చెప్పారు. అంతేగాదు ఇన్ఫ్లుయెన్సర్ కమ్యూనిటీకి ఆమె చేసిన అత్యుత్తమ సహకారానికి నిదర్శనమే ఫ్యాన్‌వ్యూ వరల్డ్ ఏఐ క్రియేటర్స్ అవార్డ్స్ ద్వారా వచ్చే ఈ గుర్తింపు అని రాహుల్ ప్రశంసించారు కూడా. ఈ ప్రపంచ వేదికపై ఆమె భారతదేశానికి, ఆసియాకి ప్రాతినిధ్యం వహించడం నిజంగా చాలా గొప్ప గౌరవం అని అన్నారు. అలాగే ఆసియా నుంచి పాల్గొన్ని ఇద్దరిలో శతావరి భారత నుంచి ఎంపికైన ఏకైక ఫైనలిస్ట్ కావడం విశేషం అన్నారు బ . కాగా, ఈ మిస్ ఏఐ తొలి మూడు విజేతల నగదు మొత్తం రూ. 16 లక్షలకు పైనే ఉంటుందట. అలాగే మిస్ ఏఐ క్రియేటర్ రూ. 4 లక్షల నగుదు బహుమితి అందుకోగా, ఏఐ మెంటర్ షిప్ ప్రోగ్రామ్‌లు, పీఆర్ సేవలకు మరిన్ని నగదు బహుమతులు పొందే అవకాశం ఉందని సమాచారం. (చదవండి: -
మిస్ ఏఐ అందాల పోటీ టాప్‌లో జరా శతావరి! ఎవరీ బ్యూటీ..? (ఫోటోలు)
-
మేకప్ లేకుండా.. మిస్ ఇంగ్లాండ్ అందాల పోటీలోకి.. చరిత్రలో తొలిసారి
మామూలుగానే ఆడవాళ్లు అలంకారాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు.. ఇక అందాల పోటీలో పాల్గొనే అతివలైతే మేకప్‌పై మరింత దృష్టి పెడుతుంటారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఏ బ్యూటీ కాంటెస్ట్‌లో అయినా అందానికి మెరుగులు దిద్దుకున్న భామలే కనిపిస్తుంటారు. కానీ లండన్‌కు చెందిన 20 ఏళ్ల మెలీసా రవూఫ్ దశాబ్దాలుగా సాగుతున్న ఈ తంతుకు బ్రేక్ వేసింది. మిస్ ఇంగ్లాండ్ అందాల పోటీలో ఎటువంటి మేకప్ లేకుండా పాల్గొన్న తొలి మహిళగా నిలవడం ద్వారా 94 ఏళ్ల ఈ పోటీ చరిత్రను తిరగరాసింది. తాజాగా ఈ పోటీల ఫైనల్స్ వరకు దూసుకెళ్లింది. వాస్తవానికి 2019లో జరిగిన మిస్ ఇంగ్లాండ్ పోటీలో మేకప్ లేకుండా కంటెస్టెంట్లు పాల్గొనే ఒక రౌండ్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేసినప్పటికీ పోటీ ఆసాంతం ఓ యువతి ఇలా మేకప్ లేకుండా పాల్గొనడం ఇదే తొలిసారి. అతివలు అంతఃసౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని చాటిచెప్పేందుకు.. అడ్వర్టైజర్లు చెప్పే అందం నిర్వచనాలు, కొలమానాలు, ప్రమాణాలను సవాల్ చేసేందుకే మేకప్ లేకుండా ఈ పోటీలో పాల్గొంటున్నట్లు మెలీసా తెలిపింది. ఈ చర్యకుగాను మెలీసాను ప్రపంచవ్యాప్తంగా ప్రశంసిస్తోంది. మిస్ ఇంగ్లాండ్ కిరీటం కోసం అక్టోబర్ 17న జరిగే ఫైనల్స్‌లో మరో 40 మందితో మెలీసా పోటీపడనుంది. -
డిగ్రీ ఫైనలియర్ ఫలితాలు విడుదల
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డిగ్రీ ఫైనలియర్ (రెగ్యులర్/ సప్లిమెంటరీ) పరీక్షా ఫలితాలను వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రాజగోపాల్ సోమవారం విడుదల చేశారు. బీఏ 68.59 శాతం, బీఎస్సీ 48.01, బీకాం 35.54, బీబీఎంలో 72.24 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వెల్లడించారు. స్కూసెట్లో ర్యాంకులు సాధించే విద్యార్థులు పీజీ ప్రవేశాలకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే డిగ్రీ ఫలితాలను ముందే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ హెచ్.లజిపతిరాయ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సుధాకర్ బాబు, ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ జె.శ్రీరాములు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎంఏ ఆనంద్, డిప్యూటీ రిజిస్ట్రార్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.