డిగ్రీ ఫైనలియర్‌ ఫలితాలు విడుదల | Degree Finaler Results Release | Sakshi
Sakshi News home page

డిగ్రీ ఫైనలియర్‌ ఫలితాలు విడుదల

Published Mon, May 29 2017 10:52 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM

డిగ్రీ ఫైనలియర్‌ ఫలితాలు విడుదల - Sakshi

డిగ్రీ ఫైనలియర్‌ ఫలితాలు విడుదల

ఎస్కేయూ : 

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డిగ్రీ ఫైనలియర్‌ (రెగ్యులర్‌/ సప్లిమెంటరీ) పరీక్షా  ఫలితాలను వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ రాజగోపాల్‌ సోమవారం విడుదల చేశారు. బీఏ 68.59 శాతం, బీఎస్సీ 48.01, బీకాం 35.54, బీబీఎంలో 72.24 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వెల్లడించారు. స్కూసెట్‌లో ర్యాంకులు సాధించే విద్యార్థులు పీజీ ప్రవేశాలకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే డిగ్రీ ఫలితాలను ముందే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్‌ ప్రొఫెసర్‌ హెచ్‌.లజిపతిరాయ్, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె.సుధాకర్‌ బాబు, ఎవాల్యుయేషన్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ జె.శ్రీరాములు, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఎంఏ ఆనంద్, డిప్యూటీ రిజిస్ట్రార్‌ ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement