నన్నయలో డిగ్రీ సప్లిమెంటరీ ఫలితాల విడుదల
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) :
ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని ఉభయ గోదావరి జిల్లాకు చెందిన డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను రిజిస్ట్రార్ ఆచార్య ఎ.నరసింహారావు బుధవారం సాయంత్రం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీఎస్సీలోని అన్ని విభాగాలకు సంబంధించిన ఈ ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో కూడా ఉంచామన్నారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ టి.మురళీధర్, సూపరింటెండెంట్ జి.చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.