డిగ్రీ ఫలితాలు విడుదల
Published Fri, May 26 2017 10:55 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM
-జబ్లింగ్ విధానం అమలుతో తగ్గిన ఉత్తీర్ణత శాతం
కర్నూలు(ఆర్‌యూ): డిగ్రీ పరీక్ష ఫలితాలను రాయలసీమ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ వై.నరసింహులు శుక్రవారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో అమ్మయిలు సత్తా చాటారు. మొత్తం మీద ఉత్తీర్ణత 42 శాతానికి మించలేదు. రెండో సెమిస్టర్‌కు 16,138 మంది హాజరవ్వగా 4,995 మంది (30.95 శాతం) ఉత్తీర్ణులయ్యారు. నాలుగో సెమిస్టర్‌కు 14,075 మందికి గాను 5,815 మంది(41.31 శాతం), మూడో సంవత్సరం విద్యార్థుల్లో 13,948 మంది హాజరవ్వగా, 5,810 మంది(41.65 శాతం) మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. గత విద్యా సంవత్సరంతో పోల్చగా ఈ సంవత్సరం ఫలితాల శాతం దారుణంగా తగ్గింది. దీనికి జంబ్లింగ్ విధానంలో పరీక్షల నిర్వహణే కారణంగా తెలుస్తోంది. మొత్తం బాలికలు 5,954 మంది పరీక్ష రాయగా 3,079 మంది(51.71 శాతం) పాసయ్యారు. బాలురు 10,184 మంది హాజరవ్వగా 1,916(18.81 శాతం) మాత్రమే పాసయ్యారు. బాలురు బీబీఏలో అత్యధికంగా 50.27 శాతం మంది, బాలికలు బీసీఏలో 92.11 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 100 మంది విద్యార్థులు వారి సమాధాన పత్రాల మీద కళాశాల కోడ్ పొందుపర్చకపోవడంతో వారి ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచారు. విద్యార్థులు ఫలితాలను www.ruk.ac.in, ruexams.in అనే వెబ్‌సైట్‌లో శనివారం నుంచి చూసుకోవచ్చు. ఏప్రిల్ 2017 పరీక్షల్లో మూడో సంవత్సరం రెగ్యులర్ పరీక్షలు రాసి ఒక్క సబ్జెక్టు ఫెయిలై ఉంటే ఇన్‌స్టంట్ పరీక్ష నిర్వహిస్తామని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
Advertisement