లండన్ : భారత సంతతికి చెందిన భాషా ముఖర్జీ(23) మిస్ ఇంగ్లండ్‌గా ఎంపికయ్యారు. గురువారం సాయంత్రం వెలువడిన ఫలితాల్లో అందాల రాణి కిరీటం దక్కించుకున్నారు. ఈ క్రమంలో ప్రపంచ సుందరి పోటీలో పాల్గొనేందుకు ఆమె అర్హత సాధించారు. కాగా భారత్‌లో జన్మించిన భాషా ముఖర్జీ.. తొమ్మిదేళ్ల వయస్సులో తల్లిదండ్రులతో కలిసి యూకే వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె వైద్య విద్యనభ్యసిస్తున్నారు.
అలా అనుకోవడం తప్పు
అందాల పోటీల్లో భాగంగా భాషా మాట్లాడుతూ..‘ చాలా మంది మేము గాల్లో విహరిస్తూ ఏవేవో కలలు కంటూ ఎవరినీ లెక్కచేయమని అనుకుంటారు. నిజానికి సమయం వచ్చినపుడు ప్రత్యేక సందర్భాల్లో మేము అందరికీ అండగా ఉంటాం. మెడికల్ స్కూల్‌లో ఉన్నప్పుడు మోడలింగ్ ఎంచుకున్నాను. అయితే చదువును, కెరీర్‌ను సమతుల్యం చేసుకోగలననే నమ్మకం వచ్చిన తర్వాతే ధైర్యంగా ముందడుగు వేశా’ అని పేర్కొన్నారు. ఇక కాబోయే సర్జన్‌గానే గాకుండా 5 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే ప్రవీణురాలిగా కూడా ఈ ముద్దుగుమ్మ గుర్తింపు పొందారు. అదే విధంగా పలు మేధా పోటీల్లో(ఐక్యూ 146) విజేతగా నిలిచి జీనియస్ అనిపించుకున్నారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment