మిస్‌ యూనివర్స్‌-2021 ఈవెంట్‌లో బాలీవుడ్‌ నటికి అరుదైన గుర్తింపు | Urvashi Rautela To Represent India As Miss Universe 2021 One Of Judge | Sakshi
Sakshi News home page

Urvashi Rautela: హాట్‌ టాపిక్‌గా ఊర్వశి రౌతేలా ఫ్రాక్‌, డైమండ్స్‌తో పొందిన ఈ డ్రెస్‌ ఖరీదెంతో తెలుసా?

Published Thu, Dec 16 2021 8:32 PM | Last Updated on Thu, Dec 16 2021 8:43 PM

Urvashi Rautela To Represent India As Miss Universe 2021 One Of Judge - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశీ రౌతేలా హాట్‌టాపిక్‌గా మారింది. ఇందుకు కారణం ఆమె మిస్‌ యూనివర్స్‌ 2021 పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించడమే కాకుండా ఈవేడుకలో ఆమె ధరించిన ఫ్రాక్‌ ఖరీదుతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఒకప్పుడు మిస్‌ యూనివర్శర్‌గా పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆమె అదే వేదికకు జడ్జీగా వ్యవహరించడం నిజంగా విశేషమే. దీంతో ఆమె ప్రస్తుతం వార్తల్లో హాట్‌టాపిక్‌ మారింది. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఊర్వశి 2013లో ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. ‘సనమ్‌ రే’, ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’, ‘హేట్ స్టోరీ-4’, ‘పాగల్‌ పంతీ’, ‘వర్జిన్‌ భానుప్రియ’సినిమాల్లో నటించి మెప్పించింది.

చదవండి: ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌, ప్రస్తుతం నో ఆఫర్స్‌, అయినా తగ్గని క్రేజ్‌..

త్వరలో ‘బ్లాక్‌రోజ్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనుందీ ఈ భామ.  ఈ క్రమంలో 2015లో భారత్ తరఫున మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొని మిస్‌ ఇండియా కిరీటం దక్కించుకుంది. ఇటీవల ఇజ్రాయెల్‌ వేదికగా జరిగిన ‘మిస్​యూనివర్స్ -2021’ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. దీంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ మిస్‌ యూనివర్స్‌ గ్రాండ్‌ ఈవెంట్‌కు భారత్‌ తరపున వెళ్లి న్యాయనిర్ణేతగా వ్యవహరించిన అతిపిన్న వయస్కురాలిగా ఊర్వశీ అరుదైన గుర్తింపు దక్కించుకుంది. ఈ పోటీల్లో మన దేశానికే చెందిన హర్నాజ్ సంధు విశ్వ సుందరి కిరీటం దక్కించుకున్న సంగతి తెలిసిందే. 

చదవండి: Pushpa Movie: విడుదలకు కొద్ది గంటలే, బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

ఇదిలా ఉంటే ఈ గ్రాండ్‌ ఈవెంట్‌ ముగిసిన అనంతరం ఈ బాలీవుడ్‌లో ఫ్యాషన్‌ దివా ముంబై విమానాశ్రయంలో బేబీ పింక్ కలర్ డ్రెస్ ధరించి కనిపించింది. ఈ సందర్భంగా కెమెరా కళ్లు ఆమెను క్లిక్‌మనిపించాయి. దీంతో ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా తను ధరించిన డ్రెస్ ధర, విశేషాలు తెలుసుకొని చాలామంది అవాక్కయ్యారు. ఊర్వశి ధరించిన ఈ డ్రెస్ ధర సుమారుగా రూ. 5లక్షల వరకు ఉంటుందని, ఈ ప్రాక్‌లో డైమండ్‌లను కూడా పొందుపరచినట్లు తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. ఆమె ధరించిన చెవి రింగులు కూడా వజ్రాలతో తయారైనవే. కాగా ఇలా వెరైటీ డ్రెస్‌లు, అవుట్‌ఫిట్‌లతో వార్తల్లో నిలవడం ఊర్వశికి మొదటిసారి కాదు. ఇంతకు ముందు ఓ మూవీ ఈవెంట్‌లో ఆమె ధరించిన రెడ్‌ ఫ్రాక్‌తో వార్తల్లో నిలిచింది. 

చదవండి: మహిళల పరువు పోయింది.. సమంత స్పెషల్‌ సాంగ్‌పై మాధవిలత షాకింగ్‌ కామెంట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement