'డాకు మహారాజ్' (Daaku Maharaaj Movie) సక్సెస్‌తో ఆనందంలో మునిగి తేలిపోతుంది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. ఎంతలా అంటే.. సమాజంలో ఏం జరుగుతుందో పట్టించుకోనంతగా! ఇటీవల బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి జరిగిన విషయం తెలిసిందే కదా! ఓ ఆగంతకుడు ముంబైలో సైఫ్ ఇంట్లో చొరబడి అతడిని దారుణంగా కత్తితో పొడిచి అక్కడినుంచి పరారయ్యాడు. నటుడికి సర్జరీ చేసిన వైద్యులు వెన్నెముక దగ్గర విరిగిన కత్తి మొనను శరీరంలో నుంచి వేరు చేశారు. ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
వజ్రపు ఉంగరం చూపిస్తూ..
ఇకపోతే ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి రౌతేలా (Urvashi Rautela)కు.. సైఫ్‌పై దాడి గురించి ప్రశ్న ఎదురైంది. అప్పుడామె సైఫ్‌పై దాడి దురదృష్టకరం అని చెప్తూనే.. నాకు మా అమ్మ డైమండ్ రింగ్ బహుమతిగా ఇచ్చింది తెలుసా? అన్నట్లుగా.. చేతికున్న వజ్రపు ఉంగరాన్ని చూపించింది. అలాగే మా నాన్న ఖరీదైన రోలెక్స్ వాచ్ కూడా ఇచ్చారు. కానీ వీటిని ధరించి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరైనా సైఫ్‌పై దాడి చేసినట్లే మనపైనా అటాక్ చేస్తారనే భయం ఉంటుంది అని మాట్లాడింది. ఈ వ్యాఖ్యలపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.
(చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ప్రియుడితో ఏడడుగులు..)
తెలియక మాట్లాడా..
ఆయనపై జరిగిన దాడి గురించి మాట్లాడమంటే నీ గిఫ్టుల గురించి చెప్తున్నావేంటని నెటిజన్లు మండిపడ్డారు. దీంతో తప్పు తెలుసుకున్న ఊర్వశి సోషల్ మీడియా వేదికగా క్షమించమని కోరింది. సైఫ్‌పై దాడి తీవ్రత తెలియకుండా నేను నటించిన డాకు మహారాజ్ సక్సెస్ వల్ల వచ్చిన బహుమతుల గురించి మాట్లాడాను. అందుకు సిగ్గుపడుతున్నాను అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది.
మళ్లీ ఇదేం పిచ్చి పని
తల్లి మీరా రౌతేలా అనారోగ్యంతో బాధపడుతుందని తెలిపింది. ఈ మేరకు మీరా ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోను షేర్ చేసింది. మా అమ్మ త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి అని క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఆ ఫోటోలో ఊర్వశి గాగుల్స్ పెట్టుకుని తల్లిని హత్తుకుంది. ఇది చూసిన జనాలు ఇక్కడ కూడా స్టైల్‌గా కళ్లద్దాలు పెట్టుకోవడం అవసరమా? అని తిట్టిపోస్తున్నారు. మరికొందరేమో సైఫ్ అలీఖాన్ గురించి నీ కామెంట్లు విన్నాకే ఆమె ఆస్పత్రిపాలైందని సెటైర్లు వేస్తున్నారు. కాగా ఊర్వశి.. డాకు మహారాజ్ సినిమాలో దబిడి దిబిడి అనే ఐటం సాంగ్‌లో ఆడిపాడింది.
చదవండి: మా నాన్న బతికుంటే ఇంకా సంతోషంగా ఉండేది: అజిత్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment