'ఆమె పేరు చెప్పడం తప్పు.. సారీ' | Miss Universe pageant host Steve Harvey says sorry | Sakshi
Sakshi News home page

'ఆమె పేరు చెప్పడం తప్పు.. సారీ'

Published Mon, Dec 21 2015 8:30 PM | Last Updated on Sun, Sep 3 2017 2:21 PM

'ఆమె పేరు చెప్పడం తప్పు.. సారీ'

'ఆమె పేరు చెప్పడం తప్పు.. సారీ'

లాస్ వెగాస్: మిస్ యూనివర్స్ పోటీల్లో విజేత పేరును మొదట తప్పుగా ప్రకటించినందుకు నిర్వాహకుడు స్టీవ్ హార్వే క్షమాపణలు చెప్పారు. పొరపాటు చేశానని, ఇందుకు చింతిస్తున్నానని హార్వే వివరణ ఇచ్చారు.

ఆదివారం రాత్రి జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో విజేత పేరును తప్పుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మిస్ ఫిలిప్పీన్స్ ఈ కిరీటాన్ని దక్కించుకోగా..  తొలుత కొలంబియా యువతి గుటిరేజ్ గెలుచుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఆమెకు కిరీటాన్ని కూడా తొడిగారు. అంతలోనే నిర్వాహకులు పొరపాటు తెలుసుకుని మిస్ యూనివర్స్ గెలుచుకుంది ఫిలిప్పీన్స్ యువతి ఉర్జ్ బ్యాక్ అని ప్రకటించారు. మిస్ కొలంబియా షాక్కు గురికాగా.. నిర్వాహకులు కిరీటాన్ని వెనక్కి తీసుకొని మిస్ ఫిలిప్పీన్స్ కు తొడిగారు. ప్రతిష్టాత్మకమైన పోటీల్లో నిర్వాహకుల తప్పిదం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement