మిస్ యూనివర్స్ విజేత ఆమె..కాదు ఈమె! | Miss Philippines Crowned Miss Universe 2015 After organisers Mistakes Miss Colombia as the Winner | Sakshi
Sakshi News home page

మిస్ యూనివర్స్ విజేత ఆమె..కాదు ఈమె!

Published Mon, Dec 21 2015 11:48 AM | Last Updated on Sun, Sep 3 2017 2:21 PM

మిస్ యూనివర్స్ విజేత ఆమె..కాదు ఈమె!

మిస్ యూనివర్స్ విజేత ఆమె..కాదు ఈమె!

లాస్ వెగాస్: ఆదివారం రాత్రి ప్రతిష్ఠాత్మకంగా జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. అమెరికా, ఫిలిప్పైన్స్, కొలంబియా దేశాలకు చెందిన ముగ్గురు యువతులు తుదిపోటీలో నిలవగా.. మిస్ ఫిలిప్పీన్స్ ఈ కిరీటాన్ని దక్కించుకుంది. అయితే ఆమెను విజేతగా ప్రకటించే ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

మిస్ యూనివర్స్ కిరీటాన్ని కొలంబియా యువతి గుటిరేజ్ గెలుచుకున్నట్లు నిర్వాహకులు తొలుత ప్రకటించడంతో ఆమెకు కిరీటాన్ని తొడిగారు. నిజంగానే మిస్ యూనివర్స్ టైటిల్ వచ్చిందని భావించి సంతోషంలో ఉన్న గుటిరేజ్కు అంతలోనే షాకిచ్చిన నిర్వాహకులు 'వి ఆర్ రియల్లీ సారీ..' మిస్ యూనివర్స్ గెలుచుకుంది మీరు కాదు ఫిలిప్పీన్స్ యువతి ఉర్జ్ బ్యాక్ అని ప్రకటించారు. దీంతో కొన్ని క్షణాల పాటు మిస్ యూనివర్స్ గా ఉన్న మిస్ కొలంబియా షాక్కు గురైంది. నిర్వాహకులు మిస్ కొలంబియా నుండి కిరీటాన్ని వెనక్కి తీసుకొని మిస్ ఫిలప్పైన్స్ గుటిరేజ్కు తొడిగారు.

పొరపాటున మిస్ యూనివర్స్గా ప్రకటించబడ్డ మిస్ కొలంబియా దీనిపై మాట్లాడుతూ 'ఇది నిర్వాహకులు కావాలని చేసిన పొరపాటు కాదు. అలా జరిగిపోయింది. దీని గురించి నేనేం బాధ పడట్లేదు' అని తెలిపింది. ప్రతిష్టాత్మకమైన పోటీల్లో నిర్వాహకుల తప్పిదం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement